High BP And Diabetes | హైబీపీ, డయాబెటిస్ అనేవి ప్రస్తుతం చాలా మందికి బద్ద శత్రువులుగా మారాయి. ఇవి రెండు మాత్రం ఒకదానికొకటి మిత్రులుగా ఉంటాయి. ఒక సమస్య ఉన్నవారికి మరొకటి సైతం కచ్చితంగా కొంత ఆలస్యంగానైనా వస్తోంది. దీంతో ఇవి రెండూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బీపీ, షుగర్ రెండూ ఉన్నాయంటే అలాంటి వారు తమ ఆరోగ్యం పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాల్సి వస్తోంది. ఈ రెండింటికి సంబంధించిన మందులను రోజూ క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్లు సూచించినట్లుగా ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలా అన్ని జాగ్రత్తలను పాటిస్తుంటేనే ఈ రెండింటినీ నియంత్రించేందుకు వీలవుతుంది. అయితే ఈ రెండు సమస్యలకు కామన్‌గా పనిచేసే ఆకులు కొన్ని ఉన్నాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
తులసి మొక్క అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులను రోజూ తీసుకుంటే అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. తులసి ఆకులను రోజూ ఉదయం పరగడుపునే నాలుగైదు నమిలి తింటుండాలి. లేదా 1 టీస్పూన్ తులసి ఆకుల రసాన్ని ఉదయం పరగడుపున తాగుతుండాలి. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ రెండింటికీ తులసి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. కనుక ఈ రెండు సమస్యలు ఉన్నవారు తులసి ఆకులను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గించడంతోపాటు బీపీని నియంత్రణలో ఉంచడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కనుక వీటిని రోజూ తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులను తినడం వల్ల పలు ఇతర వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు సైతం తగ్గుతాయి.
ఇక బీపీ, షుగర్ రెండింటికీ పనిచేయడంలో కరివేపాకులు కూడా ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులను మనం నిత్యం కూరల్లో వేస్తుంటాం. కానీ కరివేపాకులు డయాబెటిస్‌ను తగ్గించడంతోపాటు బీపీని నియంత్రణలో ఉంచగలవు. రోజూ 10 కరివేపాకులను ఉదయం పరగడుపునే నేరుగా అలాగే తింటుండాలి. లేదా వాటి రసాన్ని తీసి అయినా తాగవచ్చు. కరివేపాకుల పొడిని నీరు లేదా మజ్జిగలో కలిపి తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది. కరివేపాకులను రోజూ తినడం వల్ల బీపీ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచవచ్చు. అలాగే ఈ ఆకులతో ఇంకా అనేక ఇతర లాభాలు కూడా కలుగుతాయి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అజీర్తి నుంచి బయట పడవచ్చు. గ్యాస్ ఉండదు. శరీరానికి ఐరన్ లభిస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా కరివేపాకులతో ఇతర లాభాలను కూడా పొందవచ్చు.
డయాబెటిస్, బీపీని నియంత్రించడంలో వేపాకులు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. ఉదయం పరగడుపునే 1 టీస్పూన్ వేపాకుల రసాన్ని తాగాలి. లేదా వేపాకులను 3, 4 తీసుకుని కడిగి నేరుగా కూడా తినవచ్చు. వేపాకులను నీటిలో వేసి మరిగించి కూడా తాగవచ్చు. వేపాకులను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తసరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. వేపాకులను తింటుంటే షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను తింటే షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు షుగర్ కారణంగా వచ్చే ఇతర వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చర్మంపై ఉండే గాయాలు, పుండ్లు మానుతాయి. ఇక వేపాకులను తినడం వల్ల పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. వీటిని తింటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఆయా ఆకులను రోజూ తింటుంటే బీపీ, షుగర్ లు రెండింటికీ కామన్‌గా పనిచేస్తాయి. దీంతో ఎంతో ఉపయోగం ఉంటుంది.