Blood Sugar Levels | మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మనకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక షుగర్ వ్యాధి బారిన పడి మందులు వాడడానికి బదులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు ఇప్పుడు చెప్పే పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడకబెట్టిన కాబూలీ శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబూలీ శనగలల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, వాపులను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదేవిధంగా రాస్ప్ బెర్రీలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడతాయి.
అదేవిధంగా పొట్టు మినపపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో జామకాయలు కూడా ఎంతగానో దోహదపడతాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
పాలకూరను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. పాలకూరలో ఉండే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇక ముడిబియ్యాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడుతుంది. ఈ పదార్థాలను తరుచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ, వ్యాయామం వంటివి చేస్తూ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని, షుగర్ వ్యాధి మన దరిచేరకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.