Cold | శీతాకాలం మనల్ని అనేక అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు శీతాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి వల్ల తీవ్రమైన అలసటతో పాటు రోజువారి పనులను చేసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యలకు తరచూ మందులు వాడడం కూడా అంత మంచిది కాదు. మందులను వాడడానికి బదులుగా కొన్ని ఇంటిచిట్కాలను ఉపయోగించి ఆయా సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు. అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దగ్గుతో బాధపడే వారు అల్లాన్ని తీసుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. తాజాగా చేసిన అల్లం రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల లేదా అల్లంతో టీ చేసుకుని తీసుకోవడం వల్ల దగ్గు తీవ్రత తగ్గుతుంది.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని పెద్దలతోపాటు పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు తేనెలో కొన్ని చుక్కల అల్లం రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. విటమిన్ సి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల కాలానుగుణంగా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడంలో పసుపు చక్కగా పని చేస్తుంది. వంటల్లో వాడడంతోపాటు గోరు వెచ్చని పాలల్లో పసుపును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపాలి. తరువాత ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఇన్పెక్షన్ లు రావడం తగ్గుతుంది. గొంతునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే వేడి నీటితో ఆవిరి పట్టడం వల్ల వాయునాళాలకు తేమ అంది దగ్గు తగ్గుతుంది.
వేడి వేడి సూప్స్ ను తాగడం వల్ల జలుబు తీవ్రత తగ్గుతుంది. గొంతు నొప్పి తగ్గుతుంది. వీటిని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అలసట కూడా తగ్గుతుంది. అయితే మార్కెట్ లో లభించే సూప్స్ కు బదులుగా ఇంట్లోనే ఈ సూప్స్ తయారు చేసి తీసుకోవడం మంచిది. సూప్స్ నచ్చని వారు వీటికి బదులుగా ఇతర వేడి పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఇలాంటి సులభమైన, సహజ సిద్దమైన ఇంటి చిట్కాలను వాడడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల తీవ్రత తగ్గడంతో పాటు వీటి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. ఇక ఈ చిట్కాలను వాడినప్పటికీ సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం