Anemia | ప్రస్తుతం చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రక్తహీనత వచ్చేందుకు పోషకాహార లోపమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. పోషకాలు లేని ఆహారాన్ని తింటున్నందునే చాలా మందిలో రక్తం తగినంతగా ఉండడం లేదని వారు అంటున్నారు. ముఖ్యంగా ఐరన్ లోపం సమస్య చాలా మందికి వస్తోంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం అయ్యే విటమిన్ బి12 కూడా చాలా మందిలో లోపిస్తోంది. ఇది కూడా రక్తహీనతకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే కేవలం ఐరన్ మాత్రమే కాకుండా విటమిన్ బి12 ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక రక్తహీనత తగ్గాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జున్ను నుంచి మనకు విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. కనుక జున్ను పాలు లభించే అసలు విడిచిపెట్టకుండా తీసుకోండి. జున్నును విటమిన్ బి12కు గొప్ప వనరుగా చెప్పవచ్చు. అదేవిధంగా పాలు, పనీర్‌తోపాటు ఇతర పాల ఉత్పత్తుల్లోనూ విటమిన్ బి12 అధికంగానే ఉంటుంది. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే బ్రౌన్ రైస్‌ను ఎక్కువగా తినాలి. బ్రౌన్ రైస్‌లోనూ మనకు విటమిన్ బి12 సమృద్ధిగానే లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నారు. దీన్ని తినడం వల్ల బరువు పెరగడంతోపాటు డయాబెటిస్ బారిన కూడా పడుతున్నారు. కనుక బ్రౌన్ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ బి12 రక్తం తయారయ్యేందుకు దోహదపడుతుంది. అలాగే పలు ఇతర పోషకాలు కూడా మనకు లభిస్తాయి.
రక్తహీనత అధికంగా ఉన్నవారు రోజూ పాలకూరతో జ్యూస్ తయారు చేసి 30 ఎంఎల్ మోతాదులో సేవిస్తుంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది. పాలకూర ద్వారా ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా బీట్రూట్ జ్యూస్‌ను రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతున్నా కూడా రక్తహీనత నుంచి బయట పడవచ్చు. బీట్రూట్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే దీని ద్వారా ఐరన్ కూడా మనకు ఎక్కువగానే లభిస్తుంది. కనుక బీట్రూట్ జ్యూస్‌ను తాగుతుంటే రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
దానిమ్మ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఈ పండ్లను తింటే రక్తం అధికంగా తయారవుతుంది. లేదా ఈ పండ్ల జ్యూస్‌ను అయినా సరే రోజుకు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా సైతం మెరుగు పడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోజూ గుప్పెడు కరివేపాకులను దంచి ఆ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి తీసుకుంటుండాలి. దీంతో రక్తాన్ని పెంచుకోవచ్చు. రక్తహీనత తగ్గుతుంది. రక్తం తయారయ్యేలా చేసేందుకు గాను తోటకూర కూడా ఎంతగానో పనిచేస్తుంది. తోటకూరతో జ్యూస్ తయారు చేసి రోజూ తాగవచ్చు. లేదా తోటకూరను కూరగా వండుకుని తింటుండాలి. దీంతో రక్తం తయారవుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల విటమిన్ బి12 ఇంకా ఐరన్‌ను పొందవచ్చు. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడతారు.