Foods For Stress And Anxiety | ప్రస్తుత తరుణంలో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంకొందరు అనారోగ్య సమస్యలతోనూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి రాత్రిపూట చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఒత్తిడి, ఆందోళన తీవ్రంగా ఉన్నవారు వెంటనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే డిప్రెషన్ బారిన పడతారు. ఆత్మహత్య చేసుకుంటారు. కనుక ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక వీటిని తగ్గించేందుకు పలు రకాల ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా ఉండవచ్చు.
అవకాడోలు మనకు సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. అయితే ఇవి మన ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. అవకాడోల్లో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడేందుకు మచా టీని కూడా సేవించవచ్చు. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీంట్లో ఎల్-థియనైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ వ్యవస్థను యాక్టివ్‌గా ఉండేలా చూస్తుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కనుక రోజూ ఒక కప్పు మచా టీని సేవిస్తుండాలి.
మీరు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు డార్క్ చాకొలెట్లను తినండి. దీంతో వెంటనే ఒత్తిడి మటుమాయం అవుతుంది. వెంటనే హ్యాపీ మూడ్‌లోకి వచ్చేస్తారు. అవును, మీరు విన్నది నిజమే. డార్క్ చాకొలెట్లలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎండార్ఫిన్లను రిలీజ్ చేస్తాయి. ఇవి సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో నాడీ మండల వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి అధికంగా ఉన్నవారు పీనట్ బటర్‌ను కూడా తినవచ్చు. దీన్ని పల్లీలతో తయారు చేస్తారు. పీనట్ బటర్లోనూ పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు యాక్టివిటీని పెంచుతాయి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
చేపలను తరచూ తినేవారు హ్యాపీగా ఉంటారని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల చేపలను తింటే మన శరీరంలో సెరొటోనిన్, డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి హ్యాపీ హార్మోన్లు. కనుక ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఒత్తిడి అధికంగా ఉన్నవారు అరటి పండ్లను తినాలి. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మన మూడ్ మారుతుంది. హ్యాపీగా ఉంటాం. ఇలా పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర కూడా చక్కగా పడుతుంది.