హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. లైంగిక సంబంధాల వల్ల ఈ వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇవి సంక్రమించినప్పుడు వెంటనే తెలుసుకోలేరు. హెచ్పీవీలలో వందకుపైగా రకాలు ఉన్నాయి. హెచ్‌పీవీ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే తగ్గిపోతుంది. వీటిని సాధారణ హెచ్‌పీవీలు అంటారు. కొన్ని హెచ్‌పీవీ రకాలు సోకినప్పుడు పులిపిర్లు వస్తాయి. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత తగ్గిపోకుండా ఉంటే, ఆ వైరస్ల వల్ల కణజాలం పెరిగి క్యాన్సర్‌కి దారితీస్తుంది.
హెచ్‌పీవీ క్యాన్సర్లల్లో లోరిస్క్ హెచ్‌పీవీ, హైరిస్క్ హెచ్‌పీవీ క్యాన్సర్లున్నాయి. హెచ్‌పీవీ వైరస్ వల్ల వచ్చే హెచ్‌పీవీ క్యాన్సర్ల బారినపడిన వాళ్లలో హెడ్ అండ్ నెక్ (తల -మెడ), సర్వైకల్, ఆనల్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. హెచ్‌పీవీ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు తొంభై శాతం వరకు రక్షణ కల్పిస్తాయి.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే సమాజంలో ఆ వైరస్ ప్రభావం తగ్గి ఆ వ్యాధి కూడా పోతుంది. క్యాన్సర్ సోకిన తర్వాత, ఏదైనా సమస్య వస్తే ఇది హెచ్‌పీవీ ప్రభావమేమో అని భయపడే పరిస్థితి లేకుండా వ్యాక్సిన్లు తీసుకోవడం మంచిది. టీనేజ్‌లో ఉన్పప్పుడు పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఎక్కువమందితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నవాళ్లు, తరచూ సెలూన్లకు పోయేవాళ్లు హెచ్‌పీవీ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ అనుపమ వై. సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్