Water | మనిషి శరీరంలో మూడింట్లో రెండు భాగాలు నీరే ఉంటుంది. ఇది తెలియని విషయం కాకపోయినా,చాలాసార్లు మర్చిపోయి నీళ్లు తాగడం తగ్గిస్తారు. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గి రకరకాల సమస్యలు వస్తాయి. ఎండాకాలం అయినా, వానాకాలం అయినా.. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. హైడ్రేషన్ అంటే శరీరంలో ద్రవాల స్థాయులను సరిగ్గా ఉంచుకోవడం. హైడ్రేషన్ ఆరోగ్యాన్ని కాపాడితే, డీహైడ్రేషన్ మనిషిని అన్నివిధాలా కుంగదీస్తుంది.
ఎప్పుడు ఏం చేయాలి?
ఒక్కొక్కరికి ఒక్కోలా నీటి అవసరం ఉంటుంది. వాతావరణం, ఆరోగ్యం, శారీరక శ్రమను బట్టి ఒక్కొక్క శరీరాన్ని ఒక్కోలా హైడ్రేట్ చేయాలి. అలాగే స్త్రీ, పురుషుల్లోనూ నీటి అవసరం వేరుగా ఉంటుంది.
పురుషులు: రోజుకు దాదాపు 3.7 లీటర్ల (పదిహేనున్నర కప్పులు) నీళ్లు తీసుకోవాలి.
మహిళలు: రోజుకు దాదాపు 2.7 లీటర్ల (పదకొండున్నర కప్పులు) నీళ్లు తాగాలి.
శరీరంలో నీటి స్థాయులు పడిపోయినప్పుడు వివిధ అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. ఆయా లక్షణాలు గుర్తించి వెంటనే నీళ్లు తాగాల్సి ఉంటుంది.