Moringa Leaves | కూరగాయలు, ఆకుకూరలు అంటే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవే కనిపిస్తాయి. కానీ మన చుట్టూ పరిసరాల్లో ఉండే వాటి గురించి అంతగా ఆలోచించం. నిజానికి అలాంటి కూరగాయలు లేదా ఆకుకూరల్లోనే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో మునగాకులు కూడా ఒకటి అని చెప్పవచ్చు. వీటిని బయట మార్కెట్లో విక్రయించరు. అలా అని చెప్పి వీటిని తినకూడదు అని కాదు, తినవచ్చు, కానీ వాటిని తినాలని చెప్పి చాలా మందికి అవగాహన లేదు, ఆయుర్వేదం దీని గురించి చాలా స్పష్టంగా వివరించింది. మునగాకులు ఏకంగా 300కు పైగా రోగాలను నయం చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అయితే మునగాకులు ఆరోగ్యకరమైనవి అని తెలుసు కానీ వాటిని ఎలా తినాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు ఆయుర్వేద వైద్యులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఉపయోగించవచ్చు. దీన్ని మీరు రోజూ తాగే జ్యూస్‌లలో, స్మూతీల వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చు. రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల మునగాకు పొడిని వాడితే సరిపోతుంది. ఒక గ్లాస్ యాపిల్ లేదా నారింజ పండ్ల జ్యూస్లోనూ ఈ పొడిని కలిపి తీసుకోవచ్చు. సలాడ్స్, రోస్ట్ చేయబడిన కూరగాయలు, పాస్తా, కోడిగుడ్లపై ఈ పొడిని చల్లి తినవచ్చు. సూప్‌లు, చారు, రసం వంటి వాటిల్లోనూ కలిపి తీసుకోవచ్చు. మునగాకుల పొడితో టీ తయారు చేసి తాగవచ్చు. వేడి నీటిలో మునగాకుల పొడిని కలిపి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటిని వడకట్టి అందులో రుచికోసం తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. మీరు తినే గోధుమ బ్రెడ్ వంటి వాటిపై కూడా ఈ పొడిని చల్లి తినవచ్చు. పెరుగు, ఓట్మీల్, చియా విత్తనాలతోనూ కలిపి తినవచ్చు.
మీరు తినే సలాడ్స్‌లో మునగాకులను నేరుగా కలిపి తినవచ్చు. రోజూ చేసుకునే కూరల్లోనూ మునగాకులను కొద్దిగా వేయవచ్చు. సూప్‌లలోనూ మునగాకులను వేసి తీసుకోవచ్చు. ఈ విధంగా మునగాకులను లేదా వాటి పొడిని తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. అయితే పొడి రూపంలో తీసుకుంటే 1 లేదా 2 టీస్పూన్లకు మించకూడదు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇక మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. మునగాకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారేలా చేస్తుంది. పాలు, పాలకూర వంటి వాటి కన్నా మునగాకుల్లోనే కొన్ని వందల రెట్ల క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
మునగాకుల్లో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మునగాకుల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది. ఈ ఆకుల్లోని మెగ్నిషియం కండరాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. రాత్రి పూట పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. మునగాకుల్లో క్వర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా నివారిస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజూ మునగాకులను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ ఆకులను తినడం వల్ల లేదా పొడిని వాడడం వల్ల షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా మునగాకులను తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.