football sculpture demolished | మమతా రూపొందించిన ఫుట్‌బాల్ శిల్పం.. కూల్చేసిన బీజేపీ ప్రభుత్వం
football sculpture demolished | పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్వయంగా రూపొందించిన భారీ ఫుట్‌బాట్ శిల్పాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియానికి గుర్తింపుగా ఉన్న ఈ శిల్పం శనివారం ధ్వంసం కావడం చూసి స్థానికులు నివ్వెరపోయారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా రూపొందించిన భారీ ఫుట్‌బాట్ శిల్పాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియానికి గుర్తింపుగా ఉన్న ఈ శిల్పం శనివారం ధ్వంసం కావడం చూసి స్థానికులు నివ్వెరపోయారు. (football sculpture demolished) మమతా బెనర్జీ ఆలోచనతో రూపొందించిన ఆ శిల్పాన్ని 2017లో ఫీఫా అండర్-17 ప్రపంచ కప్‌కు ముందు ఏర్పాటు చేశారు. గత టీఎంసీ ప్రభుత్వపు చిహ్నమైన ‘బిస్వా బంగ్లా’ లోగో కూడా కూడా దీనిపై ఉన్నది.
కాగా, మొండెంపై ఫుట్‌బాల్ ఉన్న ఈ స్టాట్యూపై పలు విమర్శలు కూడా వచ్చాయి. దీనిని ఆవిష్కరించినప్పటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ విచిత్ర డిజైన్‌ను పలువురు ఫుట్‌బాల్ అభిమానులు ప్రశ్నించారు. అయినప్పటికీ అనేక ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియానికి ఒక గుర్తింపుగా అది నిలిచింది.
మరోవైపు బెంగాల్లో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి, ఆ మరునాడే ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్రకటించారు. క్రీడల మంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. ప్రఖ్యాత స్టేడియం సౌందర్యానికి ఆ ‘వికృతమైన’ నిర్మాణం ఏమాత్రం తగినది కాదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ శిల్పాన్ని కూల్చివేసింది. ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఆతిథ్యం ఇచ్చిన సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేటు సమీపంలో ఉన్న ఈ శిల్పాన్ని శనివారం ఉదయం తొలగించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ‘సాల్ట్ లేక్ స్టేడియం ముందున్న ఆ అసహ్యకరమైన నిర్మాణం గుర్తుందా? మాటిచ్చినట్లుగానే దానిని తొలగించాం’ అని బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

