మంగళవారం 02 మార్చి 2021
Health - Jan 21, 2021 , 17:47:53

మీ భాగస్వామిలో లవ్ హార్మోన్ రిలీజ్ చేయడం ఎలా..?

మీ భాగస్వామిలో లవ్ హార్మోన్ రిలీజ్ చేయడం ఎలా..?

దాంపత్య జీవితంతో పాటు శృంగార జీవితంలో కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలంటే భార్యభర్తల్లో ఉండాల్సింది పరస్పరం ప్రేమ, గౌరవం. నిజానికి అమితమైన ప్రేమను వ్యక్తపరచడమే శృంగారమని చాలా మంది చెబుతుంటారు. కానీ కొన్ని అపార్థాలు, చిన్న చిన్న గొడవల కారణంగా ప్రేమలు తగ్గి.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ పరిస్థితిని అలాగే వదిలేయడం వల్ల దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడం తప్పనిసరి అవుతుంది. కావున మీ భార్య/భర్త మీతో గొడవపడ్డా.. కోపంగా ఉన్నా వారిని అలాగే వదిలేయకుండా.. వారిలో తిరిగి ప్రేమను పుట్టిస్తే.. సంతోషంగా జీవించవచ్చన్నది నిపుణుల సూచన. మరి ప్రేమను చిగురింపజేయడం ఎలా అంటే... దానికి కొన్ని మార్గాలు ఉన్నాయట. మీ భాగస్వామిలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ చేయగలిగితే.. గిల్లికజ్జాలు మాయమై.. సుఖంగా, సంతోషంగా ఉండచ్చు. 

లవ్ హార్మోన్ రిలీజ్ అవాలంటే ఏం చేయాలి..?

కళ్లల్లోకి చూడండి

కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే ఎదుటి మనిషిలోని భావాలను ఇట్టే అర్థం చేసుకోవచ్చు అంటారు కదా. అలాగే మీరు చక్కటి చిరునవ్వుతో మీ భాగస్వామి కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశారంటే.. వారిలో తెలియని నమ్మకం కలిగి ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందట.

కౌగింలించుకోండి 

గుండెల్లో ఎంత బాధ ఉన్నా ఎదుటివారు మనల్ని కౌగిలించుకోగానే సగం బాధ నయం అవుతుందటారు. నిజంగానే కౌగిలికి అంత పవర్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ భాగస్వామి కోపంగా, చిరాకుగా ఉన్నప్పుడు మీరు వెళ్లి హత్తుకున్నారంటే.. వారికి తెలియకుండానే వారిలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. 

చేతులు గట్టిగా పట్టుకోండి

స్పర్శ అనేది బంధం బలాన్ని పెంచుతుంది. అలాగే చేతిలో చేయి వేస్తే భరోసా వస్తుంది.  ముఖ్యంగా భాగస్వామికి ఇది చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఒత్తిడి కలిగించే కొరిస్టాల్ హార్మోన్ విడుదలను, లోబీపీని తగ్గించి ఆక్సిటోసిన్ విడుదలకు తోడ్పడుతుంది.

ముద్దు పెట్టుకోండి

ముద్దు పెట్టుకోవడం వల్ల డొపమైన్ రాపిడి పెరిగి శృంగార కోరికను పెంచుతుంది. దీంతో పాటు ఆక్సిటేసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఫలితంగా పరస్పరం ప్రేమ పెరగి సుఖంగా, సంతోషంగా జీవించగలరు.

మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేయండి

సంగీతం మానసిక వైద్యానికి బాగా పనికొస్తుంది. కావున మీ భాగస్వామికి ఇష్టమైన మ్యూజిక్ పెట్టి తనతో డ్యాన్స్ చేయడం.. చేయించడం వల్ల మూడ్ మారి ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి..

లైంగిక సామర్థ్యాన్నిపెంచే ఈ దివ్యౌషధం గురించి తెలుసా..?VIDEOS

logo