100 Years Of Life | ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి వ్యాధులు రావొద్దని కోరుకుంటారు. అందుకు గాను అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చేస్తుంటారు. అయితే కొన్ని అలవాట్ల కారణంగా లేదా జీవన విధానం వల్ల లేని పోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. దీని వల్ల ఎంతగానో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎవరైనా సరే కొన్ని సూత్రాలను పాటించడం వల్ల ఎక్కువ కాలం పాటు జీవించవచ్చు. దీంతోపాటు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల అవి మీ ఆయుష్షను పెంచుతాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీంతో ఎక్కువ కాలం పాటు రోగాలు లేకుండా జీవించవచ్చు. ఇందుకు పాటించాల్సిన సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం చాలా మంది ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటుంటారు. అయితే ఇలా ఒత్తిడిని ఎదుర్కోవడం మంచిది కాదు. ఇది మన ఆయుష్షును తగ్గిస్తుంది. స్ట్రెస్ లేకుండా ఉంటేనే ఆయుష్షు పెరుగుతుంది. కనుక ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకుని మానసికంగా ప్రశాంతంగా ఉండేలా మారాలి. ఇందుకు గాను యోగా, ధ్యానం ఎంతగానో పనిచేస్తాయి. రోజూ మీరు వ్యాయామం చేస్తుంటే కాస్తంత సమయాన్ని యోగా లేదా ధ్యానానికి కేటాయించండి. లేదా మీకు ఇష్టమైన సంగీతం వినండి. ప్రకృతిలో కాసేపు గడపండి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి లేకుండా ఉంటే ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని సైంటిస్టులు చేసిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
చాలా మంది పని ఒత్తిడిలో పడి నీటిని సరిగ్గా తాగరు. అయితే మన ఆయుర్దాయానికి, నీటికి సంబంధం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. మనం రోజూ తగినన్ని నీళ్లను తాగుతుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. ఫలితంగా ఆయుర్దాయం పెరుగుతుంది. కనుక రోజూ తగినన్ని నీళ్లను తాగితే ఆయుష్షును పెంచుకోవచ్చని చెబుతున్నారు. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం ఏది చేస్తున్నా సరే అందులో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగండి. మీ గోల్‌పై ఫోకస్ పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని సైంటిస్టుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక రొటీన్‌గా జీవించకుండా మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయండి. దీంతో ఆయుష్షు పెరుగుతుంది.
మీకు సహాయం చేసిన వారిని మరిచిపోకుండా కచ్చితంగా వారికి థ్యాంక్స్ చెప్పండి. మీకు చేతనైతే వారికి అవసరం ఉన్న సహాయం చేయండి. అలాగే పాజిటివ్ థింకింగ్‌ను అలవాటు చేసుకోండి. ఇవి రెండూ మీ జీవితంలో గొప్ప మార్పును తెస్తాయి. మీ ఆయుష్షును పెంచుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. ఇవి మీ ఆయుష్షును తగ్గించేస్తాయి. మీకు త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి. కనుక వీటిని తినడం మానేయండి. బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలను తినండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ ఆయుర్దాయాన్ని పెంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. ఇలా పలు సూత్రాలను పాటించడం వల్ల మీ ఆయుష్షును కచ్చితంగా పెంచుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.