Carrot Juice | మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది తరచూ ఉపయోగిస్తుంటారు. క్యారెట్లను నేరుగా అలాగే తినవచ్చు. లేదా కూరల్లో వేసి వండుకుని తినవచ్చు. అయితే క్యారెట్లను రోజూ తినడం కష్టంగా ఉందని భావించేవారు వీటితో జ్యూస్ తయారు చేసి నిల్వ చేసుకుంటే దాన్ని రోజూ కొద్ది మొత్తంలో తాగవచ్చు. క్యారెట్ జ్యూస్‌ను రోజుకు 120 ఎంఎల్ మోతాదులో తాగితే చాలు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. ఇక పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం క్యారెట్ జ్యూస్‌ను ఉదయం పరగడుపునే సేవించాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ మనకు ఎంతగానో మేలు చేస్తుందని అంటున్నారు.
క్యారెట్లలో బీటా కెరోటిన్, లుటీన్, జియాజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కళ్లకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. వృద్ధాప్యం కారణంగా కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకుంటాయి. దీంతో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. క్యారెట్ లలో విటమిన్ సి, ఎ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు. జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల అందులో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. సూర్యకాంతి వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో చర్మం సహజసిద్ధంగా కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. క్యారెట్లలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. క్యారెట్ జ్యూస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఈ జ్యూస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. ఫలితంగా గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. క్యారెట్ జ్యూస్‌ను ఉదయం సేవిస్తేనే అధిక ప్రయోజనం ఉంటుందని, ఆ సమయంలో క్యారెట్ జ్యూస్‌ను తాగితే అందులో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ ను ఉదయం తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. క్యారెట్ జ్యూస్ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అందులో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇలా క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.