Brain | ప్రకృతి విలయాలను చూసి, తట్టుకుని, బయటపడిన వాళ్లు మరింత దృఢంగా మారతారనే అభిప్రాయం ఉంది. అది నిజం కాదని అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. ఇందుకోసం వాళ్లు తుఫానులు, వరదలు, కరువు లాంటి పరిస్థితులను తరచూ ఎదుర్కొనే వ్యక్తులను కదిపి చూశారు. ఆశ్చర్యంగా వారి మానసిక ఆరోగ్యం కాస్త తక్కువగా కనిపించింది. దీన్నిబట్టి రెండు సూచనలు చేస్తున్నారు పరిశోధకులు. ఒకటి- ఒక వ్యక్తి ఏదైనా మానసిక సమస్యను ఎదుర్కొంటూ చికిత్స కోసం వస్తే, తన నేపథ్యాన్ని కూడా గ్రహించే ప్రయత్నం చేయాలి. రెండు- తరచూ ప్రకృతి విపత్తులతో జీవించే పౌరులు మానసికంగా కుంగిపోకుండా తగిన ధైర్యం, చికిత్స అందించే ప్రయత్నం చేయాలి.