Bad Cholesterol Levels | ప్రతి ఒక్కరి శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. శరీరం విటమిన్లను జనరేట్ చేసేందుకు, శరీరం సజావుగా పనిచేసేందుకు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ అవసరం. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే హృద్రోగ ముప్పు పొంచిఉంటుంది. దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించేందుకు ఆహారం, వ్యాయామం కీలకం.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాల జాబితాను పరిశీలిస్తే వెల్లుల్లి ముందువరసలో నిలుస్తుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడమే కాకుండా బీపీని కూడా నియంత్రిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్ధం లివర్‌లో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇక కొలెస్ట్రాల్‌ను కరిగించే మరో దివ్యౌషధం పసుపు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలను కలిగిఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది.
ఇక గ్రీన్‌టీ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. గ్రీన్‌టీలో ఉండే క్యాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉండే అవిసె గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇవి రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
వెల్లుల్లి
పసుపు
గ్రీన్ టీ
అవిసె గింజలు
ఓట్స్
ఫిష్ ఆయిల్
ద్రాక్ష
దాల్చిన చెక్క
అల్లం
Read More :