మున్సిపల్ చైర్మన్ దౌర్జన్యం !
అధికార మదంతో వార్డు కౌన్సిలర్ భర్తపై మున్సిపల్ చైర్మన్, ఆయన కుమారుడు దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కలకలంరేపింది.
- బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై దాడి
వర్ధన్నపేట, నవంబర్ 17 : అధికార మదంతో వార్డు కౌన్సిలర్ భర్తపై మున్సిపల్ చైర్మన్, ఆయన కుమారుడు దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కలకలంరేపింది. సోమవారం రాత్రి వర్ధన్నపేట మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ బానోత్ జ్యోతి భర్త నవీన్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చైర్మన్ సారంగపాణి, ఆయన కుమారుడు శ్రీకాంత్ అడ్డగించారు.
ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. నవీన్ వారి నుంచి తప్పించుకుని బైక్‌పై వెళ్లిపోగా.. సారంగపాణి, ఆయన కుమారుడు కారులో వెంబడించి జఫర్గడ్ రోడ్డులో నవీన్‌ను పట్టుకొని దాడి చేశారు. నవీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వరంగల్ దవాఖానకు తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

