Health Tips | పాల ఉత్పత్తులు అనేక రకాలుగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని వయసుల వారు తప్పనిసరిగా పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పెరుగు, పనీర్ తదితర ఉత్పత్తుల కారణంతో కాల్షియం, ప్రోటీన్స్‌తో పాటు శరీరానికి అవసరమైన అనేక మూలకాలుంటాయి. పాలల్లో ఉండే పోషకాలతో ఎముకల నిర్మాణానికి కాల్షియం, విటమిన్ డీ, భాస్వరం ఉంటాయి. అలాగే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
కానీ, ఈ పాల ఉత్పత్తుల్లో వెన్న విషయానికి వస్తే.. ఆరోగ్యానికి ప్రయోజనకరమా? హానికరమా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటాయి. వెన్నలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే వెన్నను మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ పరిణామంలో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, అధికంగా తీసుకుంటే ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వెన్న ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు.
రోజు వెన్న తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కేలరీలు ఎక్కువగా తీసుకుంటే.. దాంతో పోల్చితే క్యాలరీ బర్న్ తక్కువగా ఉంటే.. బరువు పెరిగేందుకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే.. బట్టర్ తీసుకోకపోవడే మేలని సూచిస్తున్నారు.
అధిక క్యాలరీలతో పాటు వెన్నలో సంతృప్త కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు టేబుల్ స్పూన్ల వెన్నలో 14 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి అనేక విధాలుగా హానికరమని డైటీషియన్లు పేర్కొంటున్నారు. ఎక్కువ వెన్న తినడం వల్ల విసెరల్ కొవ్వు పెరుగుతుందని, దాంతో జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న వస్తువులు శరీరంలో కొలెస్ట్రాల్‌ను సైతం పెంచుతాయి. కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన ప్రమాదన కారణాల్లో ఒకటి నిపుణులు పేర్కొంటున్నారు. సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాలు రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. రక్తంలో అధిక స్థాయి LDL కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బట్టర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మానుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.