heart health and health tips | గుండెపోటు సూచనలు చాలా సరళంగా ఉంటాయి. చాలామంది వాటిని ఏ చలిజ్వరమో, ఒత్తిడో, కుంగుబాటో అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. అయితే చెమటలు పట్టడం, వికారం, కళ్లు మసకబారడం లాంటివి గుండె పోటుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక హెచ్చరికలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార విధానంతో గుండెకు బలాన్ని అందించవచ్చు.
రోజువారీ భోజనంలో కనీసం 50 శాతం కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బెంగళూరు క్యాబేజీ మొలకలు (బ్రసెల్స్ స్ప్రౌట్స్), క్యాబేజీ, బ్రకోలి లాంటి కూరగాయలు గుండెకు రక్షణగా నిలిచే యాంటీ ఆక్సిండెంట్లు, ఇతర వృక్ష రసాయనాల (ఫైటో కెమికల్స్)తో సమృద్ధమై ఉంటాయి.
రోజూ ఒక పాయ, లేదంటే 300 మిల్లీ గ్రాముల చొప్పున మూడు పూటలా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు. వెల్లుల్లి ఎర్ర రక్తకణాలు గడ్డకట్టకుండా చేసి, ధమనులు సాఫీగా రక్తాన్ని సరఫరా చేసేలా సహకరిస్తుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా చూస్తుంది. దాంతో ధమనులు కుంచించుకుపోవు.
చక్కెర కలపని 100 శాతం తాజా పండ్ల రసాలతో రోజును మొదలుపెట్టాలి. బత్తాయి రసంలో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. గుండెపోటుకు కారణమయ్యే హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం స్థాయిని తగ్గిం
చడంలో ఫోలిక్ ఆమ్లం సాయపడుతుంది. ఇక ద్రాక్షపండ్ల రసంలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిండెంట్లయిన.. ఫ్లేవనాయిడ్లు, రెజ్వెరట్రాల్ ఉంటాయి. ధమనుల్లో రక్త సరఫరా సాఫీగా సాగేందుకు ఇవి సాయపడతాయి.
వారానికి సుమారు 140 గ్రాముల గింజలు తీసుకునేవాళ్లకు హృద్రోగాలు వచ్చే ఆస్కారం తక్కువని అధ్యయనాల్లో తేలింది. అయితే కొవ్వులు, కెలోరీలు దండిగా ఉండే గింజలు తీసుకుంటే మాత్రం బరువు పెరుగుతారు.
రోజూ భోజనంలో రెండు చెంచాల అవిసెలు తీసుకోండి. ఒమేగా 3 కొవ్వులకు అత్యంత శక్తిమంతమైన వనరులు ఇవి. వీటి వల్ల హృద్రోగాల ముప్పును 46 శాతం మేర తగ్గించుకోవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.
రోజుకు 20 నిమిషాలపాటు నడవడం వల్ల గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు
టైప్ 2 మధుమేహం దాదాపుగా మన దరికిరాదని చెబుతారు నిపుణులు.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర కలుపుకుని తాగితే అంతే సంగతులు !
Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
Zinc and Cold : జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!