మూత్రం రంగు మన ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలను సూచిస్తుంది. డీహైడ్రేషన్ మొదలుకుని తీవ్రమైన అనారోగ్యాల వరకు ఎన్నో ఆరోగ్యపరమైన అంశాల హెచ్చరికలు ఇందులో దాగి ఉంటాయి. మూత్రం రంగులో దాగిన ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం.
మన శరీరం తగినంత హైడ్రేషన్‌తో, ఆరోగ్యకరమైన ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌తో ఉందనడానికి క్లియర్ యూరిన్ సంకేతం. అంటే మనం సరైన పరిమాణంలో నీళ్లు తాగుతున్నామని అర్థం. దీంతో కిడ్నీల పనితీరు సాఫీగా జరిగి టాక్సిన్లు బయటికి వెళ్లిపోతున్నాయని తెలుస్తుంది. అయితే ఒక్కోసారి ఓవర్ హైడ్రేషన్ వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
మన శరీరం తగినంత హైడ్రేటెడ్‌గా ఉందని లేత పసుపు రంగు తెలియజేస్తుంది. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని, వ్యర్థాలను సమర్థంగా తొలగిస్తున్నాయని సూచిస్తుంది.
ఇది ఓ మోస్తరు డీహైడ్రేషన్‌కు సిగ్నల్. అంటే మన శరీరానికి మరిన్ని ఫ్లూయిడ్స్ అవసరమన్న మాట. మూత్రంలో వ్యర్థ పదార్థాల గాఢత పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. నీళ్లు తీసుకునే మోతాదు పెంచితే గాఢత తగ్గి రంగు మామూలు స్థితికి వస్తుంది. శరీరంలో హైడ్రేషన్ స్థాయులు కూడా మెరుగుపడతాయి.
మూత్రంలో రక్తం ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మూత్రం ఎర్రగా ఉండొచ్చు.
డీహైడ్రేషన్ వల్లగానీ, లేదంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు, మందుల వల్ల మూత్రం నారింజ రంగులో వస్తుంది. కాలేయం లేదా బైల్ జ్యూస్ సమస్యలకు హెచ్చరిక కూడా కావొచ్చు.
ఇది చాలా అరుదుగా తలెత్తుతుంది. ఆహార పదార్థాల రంగులు, కొన్ని ప్రత్యేకమైన మందులు, లేదంటే వైద్య చికిత్సలో ఉపయోగించే కొన్ని రంగులు మొదలైన వాటివల్ల వస్తుంది. అయితే, బయటి కారకాల వల్ల కాకపోతే మాత్రం ఏదైనా ఆరోగ్య సమస్యల మూలంగా వచ్చి ఉండొచ్చని అనుమానించాలి.
తీవ్రమైన డీహైడ్రేషన్‌కు.. లేదంటే కాలేయం, కిడ్నీల సమస్యలకు సంకేతం. కొన్ని రకాలైన ఆహారం, ఔషధాల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.
మూత్రంలో బ్యాక్టీరియా, తెల్ల రక్తకణాలు, స్ఫటికాల వంటివి ఉంటే ఇలా జరుగుతుంది. ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో రాళ్లకు సంకేతం.
డీహైడ్రేషన్ వల్ల గానీ, లేదంటే వెంటవెంటనే మూత్రానికి వెళ్లే పరిస్థితి వల్ల ఇలా జరుగుతుంది. దీర్ఘకాలం పాటు ఇలా జరుగుతుంటే అది ప్రొటీనూరియాకు సంకేతం. అంటే మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సమస్య అన్నమాట. కిడ్నీల వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు దీన్ని సంకేతంగా భావించాలి.
కొవ్వుతో కూడిన లింఫటిక్ ఫ్లూయిడ్స్ మూత్రంలోకి విడుదలయ్యే సమస్య.. కైలూరియా కారణంగా మూత్రం తెల్లగా వెలువడుతుంది. దీన్ని లింఫటిక్ లేదంటే కిడ్నీ సమస్యలకు సంకేతంగా భావించాలి.