న్యూఢిల్లీ : బరువు తగ్గాలని, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాలని కోరుకుని వారుండరు. అయితే సత్వరమే బరువు తగ్గాలనే విషయంలో ఆరోగ్యపరమైన రిస్క్‌లను (Health Risks) కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కఠినమైన ఆహార నియమాలు, తీవ్ర కసరత్తులు, వ్యాయామంపై దృష్టిసారించేవారు వేగంగా బరువు తగ్గడంతో కూడా ఆరోగ్యపరమైన సైడ్ ఎఫెక్ట్స్ ముప్పు పొంచిఉంటుందని గమనించాలని సూచిస్తున్నారు.
రాత్రికి రాత్రి బరువు తగ్గడం జరిగే పనికాదు. బరువు తగ్గాలనుకునే క్రమంలో తొందరపాటుతో వ్యవహరిస్తే శరీరం నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడతాయి. ఒక్కసారిగా బరువు తగ్గాలని చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోగా పలు సైడ్‌ఎఫెక్ట్స్‌ను కలిగిస్తాయి. వేగంగా బరువుతగ్గాలనుకునే వారిలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి దుష్ర్పభావాలు కనిపిస్తాయి.
శరీరం పనిచేసేందుకు అవసరమైన ఎలక్ట్రోలైట్స్ సమతూకం దెబ్బతింటే కండ్లుతిరగడం, అర్ధీమియా వంటి ప్రమాదకకర పరిస్ధితులకూ దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేగంగా బరువుతగ్గే క్రమంలో తలెత్తే సైడ్ఎఫెక్ట్స్ ఏంటంటే..
ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత
గాల్‌బ్లాడర్ స్టోన్స్
కండరాల క్షీణత
పోషకాహార లోపం
డీహైడ్రేషన్
Read More :
Water | మీరు తాగే నీళ్లు ఎంత స్వచ్ఛమైనవి? రోగాలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!