ఇబ్రహీంపట్నం, మర్చి 1: కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం పల్లె, పట్టణం అని తేడా లేకుండా చెరుకు రసాన్ని విక్రయిస్తున్నారు. ధర కూడా అందుబాటులో ఉండి ఆరోగ్యానికి చెరుకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, మండుటెండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చెరుకు రసం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరగడంతోపాటు ఎలాంటి వ్యాధులు దరి చేరవని, ప్రతి ఒక్కరు క్రమంగా చెరుకు రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.