Omega 3 Fish oil | చేపలు అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారాల్లో ముందు వరసలో ఉంటాయి. చేపల్లో ఓమేగా 3 కొవ్వులు అధికంగా లభిస్తాయి. వీటితో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. చేపలను తినేందుకు చాలా మంది ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు చేప నూనె సప్లిమెంట్లను వాడవచ్చు. చేప నూనె ద్వారా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇదే కారణంతో ఫిట్నెస్ ఔత్సాహికులు, బాడీబిల్డర్లు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేప నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. సాల్మోన్, కాడ్ వంటి చేప జాతుల కణజాలల నుంచి నూనెను తీస్తారు. ఇందులో ఇకోసాపెంటెనోయిక్ ఆసిడ్, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం, ఓమెగా 3 వంటి కొవ్వు అమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఇవీ ప్రయోజనాలు..
చేపలను ఎప్పుడైనా తినవచ్చు. అలాగే, చేప నూనె సప్లిమెంట్లను కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే, పాలు తాగే అలవాటు ఉన్నవారిలో సమస్య రాకుండా ఉండేందుకు పాలు తాగిన రెండు గంటల తర్వాత ఈ సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 18 ఏండ్లకు పైబడిన వారు ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిదే. అయితే, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భం ధరించిన వారు వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది.