ఏ జబ్బుతో డాక్టర్ని సంప్రదించినా నీళ్లు తాగాలని సూచిస్తారు. వైద్యులు చెప్పే మాటలు నీటి మూటలు కావండోయ్. ఆరోగ్యానికి అవే మేలు తలపులని పరిశోధనలు చెబుతున్నాయి. నీళ్లు తాగితే ఎన్నో రోగాలు రానే రావని ఓ తాజా పరిశోధన తేల్చింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూరాలజీ విభాగాధిపతి బెంజమిన్ బ్రేయర్ సారథ్యంలోని పరిశోధక బృందం వివిధ వ్యాధులకు, తాగే నీటికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది. ఇందుకోసం 24 ఏండ్ల కాలంలోని పరిశోధనా పత్రాలను అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా నీళ్లు బాగా తాగే వాళ్లకు అనేక రోగాలు రానే రావని, రోగాలు ఉన్నా అవి తగ్గుముఖం పట్టాయని గుర్తించింది. సదరు అధ్యయనంలో వెల్లడైన కొన్ని అంశాలు ఇవి..