Health tips : శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఆహార నియమాలు పాటిస్తూ నిత్యం వ్యాయామం చేసినా ఫలితం లేక పలువురు నిరాశ చెందుతుంటారు. జీవనశైలితో పాటు ఆహారంలో మార్పులు చేసినా కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తుంటే చక్కటి పరిష్కారంగా తృణధాన్యాలు, పప్పుధాన్యాలను ఎంచుకోవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. తృణధాన్యాలు, పప్పులు కొవ్వును కరిగించేందుకు అద్భుతంగా పనిచేస్తాయని హార్వర్డ్ పరిశోధకులు తెలిపారు.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగ్గా నిర్వహించడంలో పప్పులు, తృణధాన్యాలు ఉపకరిస్తాయని జామా ఇంటర్నర్ మెడిసిన్ జర్నల్‌తో పాటు, అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన అధ్యయనాల్లో నిపుణులు వెల్లడించారు. పప్పులు, తృణధాన్యాల్లో ఉండే ప్రొటీన్ ఎముకలు, నరాలను పటిష్టం చేయడంతో వయసు మీదపడటంతో వచ్చే ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది.
ప్రొటీన్ అధికంగా ఉండే పప్పులు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా త్వరగా ఆకలి వేయకపోవడంతో అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. వీటిలో ఉండే ప్రొటీన్‌తో కండర పుష్టి కలిగి కొవ్వును కరిగించడంతో పాటు తీరైన శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు.