Online Games | ఫోన్లో అదే పనిగా గంటల తరబడి గడిపితే ఏమవుతుందంటే..!
పిల్లల నుంచి పెద్దల వరకూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి గంటల తరబడి గేమ్స్ (Online Games) ఆడటం చూస్తుంటాం. అయితే అదే పనిగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయితే ఎన్నో నష్టాలు వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు
న్యూఢిల్లీ : పిల్లల నుంచి పెద్దల వరకూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి గంటల తరబడి గేమ్స్ (Online Games) ఆడటం చూస్తుంటాం. అయితే అదే పనిగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయితే ఎన్నో నష్టాలు వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేటెస్ట్ సర్వేలో రోజుకు 12 గంటలు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయే వారు పెద్దసంఖ్యలో ఉన్నారని వెల్లడవడం ఆందోళన రేకెత్తిస్తోంది. అధిక సమయం ఫోన్లో గేమ్స్ ఆడితే ముందుగా కండ్లకు తీవ్ర హాని కలుగుతుంది.
ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా గంటల తరబడి మొబైల్ స్ర్కీన్‌కు అతుక్కుపోతే కండ్లు తీవ్ర అలసటకు లోనవుతాయి. కండ్లకు ఒత్తిడి కలగడంతో పాటు తలనొప్పి కూడా వేధిస్తుంది. రోజులు గడిచేకొద్ది కంటిచూపు మందగించే ప్రమాదం ముంచుకొస్తుంది. ఎక్కువసేపు గేమ్ ఆడుతూ మొబైల్ ఫోన్లలో గడిపితే ఉత్పాదకత పడిపోతుంది. గేమ్ ఆడటాన్ని మీరు ఆస్వాదించినా మీరు ఎదిగేందుకు అవసరమైన ఇతర పనులు చక్కదిద్దడం నిలిచిపోతుంది. ఇక యాప్ స్టోర్స్ నుంచి మీరు పలు ఆన్లైన్ గేమ్స్‌ను డౌన్లోడ్ చేసుకునే క్రమంలో వాటితో పాటు మాల్వేర్, వైరస్లు మీ మొబైల్ ఫోన్లో ప్రవేశించే ముప్పు పొంచిఉంది.
ఆయా గేమ్‌లు సరైనవా కాదా అని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాతే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్ ద్వారా చౌకబారు, ఫ్రీ వెర్షన్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం అవాయిడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక నిరంతరం మొబైల్ ఫోన్లకు బానిస కావడంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు సోషల్ లైఫ్ కూడా ప్రభావితమవుతుంది. ఆన్లైన్ గేమ్స్ మీకు వ్యసనంగా మారడంతో మీకు అత్యంత ఆత్మీయులను కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు సమయం కేటాయించలేకపోతారు.
Read More :
నలభై నిండకుండానే ఆగిపోతున్న గుండెలు.. ఎందుకీపరిస్థితి?.. డాక్టర్లేమంటున్నారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

