Happy Foods | నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది ప్రస్తుతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడితోపాటు ఇతర అనేక రకాల సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు. దీంతో సహజంగానే డిప్రెషన్ వస్తోంది. అయితే పలు రకాల ఆహారాలు మన ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయో, మూడ్ ను మార్చేందుకు కూడా కొన్ని రకాల ఫుడ్స్ ఉపయోగపడతాయి. ఈ ఫుడ్స్‌ను తినడం వల్ల మన మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగు పడి యాక్టివ్‌గా మారుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. ఇక ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ మూడ్‌ను మార్చి హ్యాప్పీగా ఉండేలా చేయడంలో డార్క్ చాకొలెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో సెరటోనిన్, ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుంది. డార్క్ చాకొలెట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ చాక్లెట్లలో ఉండే మెగ్నిషియం ఒత్తిడి నుంచి బయట పడేలా చేస్తుంది. మనస్సు రిలాక్స్ అయ్యేలా చూస్తుంది. చిన్న డార్క్ చాక్లెట్ తింటే చాలు మంచి మూడ్‌లోకి వస్తారు. ఒత్తిడి మటుమాయం అవుతుంది.
అరటి పండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది సెరటోనిన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. అలాగే న్యూరోట్రాన్స్మిటర్లు సైతం చక్కగా పనిచేస్తాయి. దీంతో మూడ్ మారుతుంది. అరటి పండ్లలో సహజసిద్ధమన చక్కెర, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగర్‌ను పెంచుతాయి. దీంతో మంచి మూడ్‌లోకి వస్తారు. హ్యాపీగా ఉంటారు.
బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. దీంతో డిప్రెషన్, కంగారు, ఆందోళన తగ్గుతాయి. మూడ్ మారుతుంది. హ్యాపీగా ఉంటారు. ఓట్స్‌లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతోపాటు శరీరానికి శక్తి లభిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్‌ను తింటే మూడ్ మారుతుంది. రోజంతా హుషారుగా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
పాలకూర వంటి ఆకుకూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు డోపమైన్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతోషంగా ఉంటారు. హుషారు వస్తుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు. డిప్రెషన్ తగ్గుతుంది. ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి బయట పడేస్తాయి. మీ మూడ్ బాగా లేనప్పుడు ఈ బెర్రీ పండ్లను గుప్పెడు తిని చూడండి. వెంటనే మంచి మూడ్‌లోకి వస్తారు. ఇలా పలు రకాల ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడతారు. మైండ్ యాక్టివ్‌గా పనిచేస్తుంది. డిప్రెషన్ తగ్గుతుంది.