పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. చర్మం, కేశ సంరక్షణలోనూ పెరుగు కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగులో ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బీ5, విటమిన్ బీ12 పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదల, మృదుత్వం, చుండ్రు తొలగింపు, లోతైన కండిషనింగ్కి బాగా పనిచేస్తాయి. పెరుగులో కొన్ని పదార్థాలను కలిపి ఇంట్లోనే తయారుచేసుకోగలిగే కొన్ని హెయిర్ మాస్క్లు ఇవి…
గుడ్లు: పెరుగులో గుడ్డును కలిపి వెంట్రుకల కుదుళ్లకి మర్దన చేయడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. దీన్ని తయారు చేయడానికి, 2 స్పూన్ల పెరుగులో ఒక కోడిగుడ్డు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ హెయిర్ మాస్క్ని వారానికి ఒకసారి ఐప్లె చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తేనె: మృదువైన జుట్టు కోసం హనీ కర్డ్ హెయిర్ మాస్క్ చక్కగా పనిచేస్తుంది. ఒక కప్పు పెరుగులో 2 స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివరల వరకు ఐప్లె చేసి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్ వేయడం వల్ల జుట్టు పట్టులా మెరిసిపోతుంది.
గుడ్లు, తేనె: జుట్టు రాలడాన్ని నివారించడంలో ఈ హెయిర్ మాస్క్ చక్కగా పనిచేస్తుంది. 6-7 చెంచాల పెరుగులో 2 చెంచాల తేనె, ఒక కోడిగుడ్డు వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూతో హెడ్బాత్ చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మృదువుగా, బలంగా మారుతుంది.