Hairfall | చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. చుండ్రుతోపాటు వెంట్రుకలు బలహీనపడి, రాలిపోతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిని గుర్తించి.. పరిష్కార మార్గాలను ఫాలో అయితే, కేశాలు బలంగా తయారవుతాయి.
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, రక్త నాళాలు ఇరుకుగా మారుతాయి. దాంతో జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలు చేరడం తగ్గుతుంది. ఫలితంగా, జుట్టు బలహీనపడి.. ఎక్కువగా రాలిపోతుంటుంది. దీనిని నివారించడానికి ప్రతిరోజూ నాలుగైదు నిమిషాలపాటు తల మీద తేలికగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నిత్యం వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల కూడా రక్త ప్రసరణ బాగుంటుంది. పాలకూర, బీట్రూట్, దానిమ్మ, వాల్నట్స్, గుమ్మడిగింజలు లాంటివి ఆహారంలో భాగం చేసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది.