న్యూఢిల్లీ : కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న స్నాక్స్, ఆహార పదార్ధాలను (Health Tips) చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కార్బోహైడ్రేట్స్‌లో చాలా వరకూ గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ సరిపడని వారి సంఖ్య పెద్దసంఖ్యలో ఉండటంతో ఈ తరహా ఆహార పదార్ధాలు తీసుకునే వారిలో తరచూ పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గ్లూటెన్ సరిపడని వారు తరచూ వికారం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడుతుంటారు. గ్లూటెన్‌తో కూడిన ఆహారంతో బరువు పెరగడంతో పాటు జ్ఞాపక శక్తినీ దెబ్బతీస్తుందని ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తేలింది.
ఇక గ్లూటెన్ ఆహారం సరిపడని వారు ఎనీమియా, కుంగుబాటు, వికారం, ఏకాగ్రత లోపించడం, డయేరియా, మలబద్ధకం, అలసట, కీళ్ల నొప్పులు, చర్మంపై మచ్చలు, నోటి అల్సర్లు, టూత్ ఎనామిల్ సమస్యలతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. గ్లూటెన్ ఇన్టాలరెన్స్ కలిగిన వారు బీరు, బిస్కెట్లు, బ్రెడ్, కేకులు, సిరిల్స్, గ్రేవీ, పాస్తా, సాస్‌లు, పేస్ట్రీలు, నూడుల్స్ వంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఫైబర్ అధికంగా ఉండి, కొవ్వులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలను అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More :