నోయిడా, అక్టోబర్ 4: యూపీలోని నోయిడాలో 41వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి 28 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెక్టార్ 94లోని సూపర్నోవా స్పైరా భవనంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు గురుగ్రామ్‌కు చెందిన మనేసార్ నివాసి అని, ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఏడాది కుమారుడి ఆరోగ్య సమస్య ఉందని ఆ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెప్పారు. ఆత్మహత్యకు ముందు నోయిడాలోని సూపర్నోవాలో చెక్‌ఇన్‌కు ముందు అతను పలు హోటళ్లలో దిగినట్టు గుర్తించామన్నారు. బాధితునికి 2024లో వివాహం అయ్యిందని, భార్య విడాకులు ఇచ్చిందని, కుమారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అతని చికిత్స కోసం రూ. 35 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయినట్టు పోలీసులు తెలిపారు.