సంగారెడ్డి : పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ రోడ్ ఎగ్జిట్ 4 నుంచి ఎగ్జిట్ 3కి వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. డీసీఎం ఢీ కొట్టడంతో కారు ఎగిరి పక్కనున్న రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో, వారిని వెంటనే హైటెక్ సిటీ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్న కారును డీసీఎం ఢీ కొట్టింది. వేగంతో డీసీఎం ఢీకొట్టడంతో కారు ఎగిరి సైడ్ రోడ్లో పడింది. పక్క లేన్లో వస్తున్న కారు.. ఈ కారు ఢీ కొని రెండు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన హైటెక్ సిటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పఠాన్ చెరు పోలీసులు వివరాలు నమోదు చేసి కేసు నమోదు చేశారు.
