యాలకులు ఓ సూపర్‌ఫుడ్
సన్నగా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా? కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి యాలకులు మంచి ఎంపిక అంటున్నది ఓ కొత్త పరిశోధన. యాలకులను భోజనంలో భాగం చేసుకుంటే ఆకలి పెరగడం, కొవ్వు తగ్గడం, ఇన్ఫ్లమేషన్ తగ్గడం లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. యూకలిప్టస్, పుదీనా, మిరియాలు కలగలిసిన సువాసన ఉండే యాలకులు ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచం అంతటా ఆదరణ పొందిన మసాలా దినుసు.
సన్నగా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా? కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి యాలకులు మంచి ఎంపిక అంటున్నది ఓ కొత్త పరిశోధన. యాలకులను భోజనంలో భాగం చేసుకుంటే ఆకలి పెరగడం, కొవ్వు తగ్గడం, ఇన్ఫ్లమేషన్ తగ్గడం లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. యూకలిప్టస్, పుదీనా, మిరియాలు కలగలిసిన సువాసన ఉండే యాలకులు ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచం అంతటా ఆదరణ పొందిన మసాలా దినుసు. ఈ అధ్యయనాన్ని టెక్సాస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు జరిపారు. అంతిమంగా యాలకులను ‘సూపర్ ఫుడ్’గా తేల్చారు.
“ఈ చిన్ని సుగంధద్రవ్యం శరీరంలో కేలరీలను కరిగించి, బరువును క్రమబద్ధం చేస్తుంది. అదే సమయంలో ఆకలిని, తినే ఆహారం మోతాదును పెంచు తుందని మేం కనుగొన్నాం” అంటారు పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన లూయీస్ సిజ్నరోస్ జెవెలస్. ఈ అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్‌లో ప్రచురితమైంది. ఎంపికచేసిన జంతువులకు యాలకులను ఆహారంగా ఇచ్చి పరీక్షించారు నిపుణులు. నిర్ణీత వ్యవధి తర్వాత వాటిలో సానుకూల మార్పు వచ్చింది. మనం రోజుకు 10 యాలకులను ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

