Cool Drinks | పిల్లలకు కూల్ డ్రింక్స్, పండ్ల రసాలను ఎక్కువగా తాగిస్తే ప్రమాదం.. పెద్దయ్యాక వారికి హైబీపీ వస్తుంది..
చిన్నప్పటి నుంచి పిల్లలు తాగే పానీయాలు వారి భవిష్యత్తు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్లను తరచూ తాగే పిల్లల్లో పెద్దయ్యాక అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
Cool Drinks | చిన్నప్పటి నుంచి పిల్లలు తాగే పానీయాలు వారి భవిష్యత్తు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్లను తరచూ తాగే పిల్లల్లో పెద్దయ్యాక అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన పానీయాల అలవాట్లు పెంపొందించడం గుండె ఆరోగ్యానికి ఎంతో కీలకమని వారు సూచిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 25 వేల మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సుమారు 25 సంవత్సరాల పాటు పరిశీలించారు. చిన్ననాటి నుంచి యుక్తవయస్సు వరకు వారు తీసుకున్న చక్కెర పానీయాలు, ఫ్రూట్ జ్యూస్, తాజా పండ్ల వినియోగాన్ని విశ్లేషించి, పెద్దయ్యాక వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
అలాంటి వారికి ముప్పు ఎక్కువ..
రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చక్కెర కలిగిన పానీయాలు తాగిన పిల్లకు, వారానికి మూడు సార్ల కంటే తక్కువగా తాగిన వారితో పోలిస్తే భవిష్యత్తులో రక్తపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఒక్కసారి శీతల పానీయం తాగిన వారిలో కూడా ఈ ప్రమాదం 23 శాతం పెరిగింది. అలాగే స్పోర్ట్స్ డ్రింక్స్ను తరచూ తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 36 శాతం అధికంగా నమోదైంది. చాలా మంది తల్లిదండ్రులు ఫ్రూట్ జ్యూస్లను శీతల పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు. అయితే రోజుకు ఒకటిన్నర సర్వింగ్ లేదా అంతకంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ తాగిన పిల్లల్లో కూడా భవిష్యత్తులో రక్తపోటు వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వంద శాతం పండ్ల రసంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ, అందులో పీచు పదార్థం ఉండదు. పీచు లేకపోవడంతో చక్కెర వేగంగా రక్తంలో కలసి రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వారు వివరించారు.
ఇతర అనారోగ్య సమస్యలు కూడా..
చక్కెర పానీయాల్లో ముఖ్యంగా ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, శరీరంలో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ గుండె, రక్తనాళాలపై అదనపు ఒత్తిడిని పెంచి అధిక రక్తపోటుకు దారితీసే అవకాశాన్ని పెంచుతాయి. అయితే మొత్తం ఫ్రక్టోజ్ పరిమాణం కంటే అది ఏ ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్తుందనేదే ముఖ్యమని అధ్యయనం సూచించింది. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ మాత్రం అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచలేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి కారణం పండ్లలో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రక్షణాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
తాజా పండ్లు మేలు..
పిల్లలు ప్రతిరోజూ తాగే ఒక చక్కెర పానీయాన్ని తాజా పండ్లతో భర్తీ చేస్తే భవిష్యత్తులో రక్తపోటు వచ్చే ప్రమాదం 22 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని అధ్యయనం తెలిపింది. అలాగే చక్కెర పానీయాల స్థానంలో నీరు లేదా పాలు తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. రక్తపోటును సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది. నియంత్రించకపోతే గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. చిన్ననాటి నుంచి ఏర్పడే ఆహారపు అలవాట్లు జీవితాంతం కొనసాగుతాయని, అందుకే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాల అలవాట్లను చిన్న వయసులోనే పెంపొందించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- cool drinks
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

