ఆ ఇంట్లో ఓ పాపాయి పుట్టింది. ఆ కొత్త మనిషిని అందరూ సంతోషంగా స్వాగతించారు… ఒక్కరు తప్ప. అది తన అన్న. అందరూ ఆ పాపాయినే ముద్దు చేయడం, సమయం కేటాయించడం తనకు ఎందుకో నచ్చడం లేదు. ఈ తరహా సిబ్లింగ్ రైవల్రీ గురించి మనకు తెలియనిదేమీ కాదు. ఈర్ష్య, పోలికల్లాంటి కారణాలతో ఒకే కడుపున పుట్టినవారి మధ్య శత్రుత్వం ఏర్పడవచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఈ కొట్లాటలను సహజంగా భావిస్తుంటారు. కానీ అవి పిల్లల మనసు మీద దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ సిబ్లింగ్ రైవల్రీని దూరం చేసేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
ఎన్ని విభేదాలు ఉన్నా, ఎంత కాదనుకున్నా… రక్తసంబంధానికి ఉండే ప్రత్యేకత వేరు. దాన్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందులో పెద్దల పాత్ర ఎంతైనా ఉంది!