Ghee On Empty Stomach | భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. అప్పట్లో మన పూర్వీకులు ప్రతి ఇంటిలోనూ కచ్చితంగా పాడి ఉండేది. దీంతో పాలు, పెరుగు, నెయ్యి వంటివి సమృద్ధిగా అందరికీ లభించేవి. కానీ ఇప్పుడు స్వచ్ఛమైన పాలు, నెయ్యి లభించాలంటే కష్టంగా మారింది. అయితే స్వచ్ఛమైన నెయ్యిని తింటే మనకు అనేక ఆరోగ్య పరమైన లాభాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పంచకర్మ చికిత్సలో నెయ్యిని ప్రథమ ఔషధంగా ఇస్తారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ నెయ్యిని తింటే అనేక ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ నెయ్యిని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు.
రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ నెయ్యిని తింటే జీర్ణాశయంలో పలు ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణాశయంలో ఆమ్లాలు సరిగ్గా విడుదల అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తాయి. ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి లభించేలా చూస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. నెయ్యిలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల నెయ్యిని తింటే శక్తి త్వరగా లభిస్తుంది. ఉదయం పరగడుపునే నెయ్యిని తినడం వల్ల శరీరానికి త్వరగా శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. రోజంతా యాక్టివ్గా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. బద్దకం పోతుంది. ఎంత పని చేసినా అలసట అనేది రాదు.
అధిక బరువు ఉన్నవారు నెయ్యిని తినేందుకు జంకుతుంటారు. కానీ ఇది అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిని ఒక టీస్పూన్ మోతాదులో రోజూ తినడం ఆరోగ్యకరమే అని వారు అంటున్నారు. దీని వల్ల శరీరంలోని కొవ్వును కరిగించవచ్చని, అధిక బరువు తగ్గుతారని, బరువు నియంత్రణలో ఉంటుందని అంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలని చూస్తున్నవారు నెయ్యిని కచ్చితంగా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. నెయ్యిని తింటే రోజంతా ఆకలి కంట్రోల్లో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. నెయ్యిని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, నిర్మాణానికి అవసరం అయ్యే అనేక పోషకాలు నెయ్యిలో ఉంటాయి. మెదడు కణాలు నెయ్యి వల్ల ఉత్తేజంగా మారుతాయి. దీంతో రోజంతా మెదడు యాక్టివ్గా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు.
నెయ్యిలో బ్యుటీరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్. ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉండడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. అందువల్ల నెయ్యిని పరగడుపునే తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. నెయ్యిలో డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో శరీరం సహజసిద్ధంగా డిటాక్స్ అవుతుంది. ఇలా పరగడుపునే నెయ్యిని తింటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే గుండె జబ్బులు ఉన్నవారు, కొలెస్ట్రాల్, బీపీ అధికంగా ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు నెయ్యి తింటే మంచిది.