Health Tips | నాభి శరీరానికి కేంద్ర బిందువని ఆయుర్వేదం చెబుతున్నది. నాభి శరీరంలోని ప్రతి భాగానికి అనుసంధానమై ఉంటుంది. నాభిలో నాలుగు చుక్కల స్వదేశీ ఆవు నెయ్యి వేసి మర్దన చేయడం వల్ల పలు వ్యాధులను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతున్నది. రాత్రి పడుకునే ముందు నాభిలో నెయ్యి రాయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. నాభిలో నెయ్యిని ఎలా రాయాలి.. దాంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!
రాత్రి పడుకునే ముందు నాభిలో నెయ్యి చుక్కలు వేసి మర్దన చేయడం వల్ల జీర్ణ సమస్యల బారి నుంచి బయటపడవచ్చు. రాత్రి పడుకునే ముందు నాభిలో నెయ్యి రాయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఆమ్లత్వం, ఉబ్బరం సమస్య తగ్గుతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. నాభిలో నెయ్యి రాయడం వల్ల శరీరంలో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ ఉంటే.. మీరు బొడ్డులో రెండు చుక్కల నెయ్యి రాసి చూడండి.
కీళ్ల నొప్పులకు..
వర్షాకాలంలో తరచుగా కీళ్ల నొప్పితో బాధపడుతుంటారు. కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. మీరు బొడ్డులో నెయ్యి రాయవచ్చు. నెయ్యి రాయడం వల్ల వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు చాలా కాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే.. మందులు తీసుకోవడంతో పాటు ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించొచ్చు.
పొడి చర్మం
నాభిలో నెయ్యి రాయడం వల్ల చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది. నాభిలో నెయ్యి రాయడం వల్ల చర్మం పొడిబారడం, నీరసం సమస్యలు తగ్గిపోతాయి. ముఖంపై మెరుపు వస్తుంది. మీ చర్మం పొడిగా, గరుకుగా ఉంటే.. రాత్రి పడుకునే ముందు బొడ్డులో నెయ్యి రాసి చూడండి.