Gas Trouble Home Remedies | వెనుక నుంచి గ్యాస్ రిలీజ్ చేయడం అన్నది సహజంగానే అందరికీ జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సార్లు పలు కారణాల వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అపాన వాయువు మరీ అతిగా రిలీజ్ అవుతుంది. దీంతో నలుగురిలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే గ్యాస్ సమస్య ఇలా తీవ్రంగా వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, అతిగా ఆహారం తినడం, అజీర్తి, కడుపు ఉబ్బరం, శీతల పానీయాలను లేదా చల్లని పానీయాలను అధికంగా తాగడం, టీ, కాఫీలను అధికంగా తాగడం, పప్పు దినుసులను, నట్స్, డ్రై ఫ్రూట్స్‌ను అతిగా తీసుకోవడం, ఆందోళన, ఒత్తిడి.. వంటి కారణాల వల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అందరి ఇళ్లలోనూ అల్లం ఉంటుంది. అల్లాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేసే ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తుండాలి. లేదా అల్లాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. దీంతో గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి, మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నవారికి పెప్పర్మింట్ టీ కూడా అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. పెప్పర్మింట్ టీని పుదీనా ఆకులతో తయారు చేస్తారు. అందువల్ల ఈ హెర్బల్ టీని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పుదీనాలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల పెప్పర్మింట్ టీని తాగితే జీర్ణవ్యవస్థలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. అలాగే జీర్ణవ్యవస్థలో ట్రాప్ అయి ఉన్న గ్యాస్ కూడా బయటకు వస్తుంది. గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గించడంలో సోంపు గింజలు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. సోంపు గింజలను నేరుగా తినవచ్చు లేదా వీటిని నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఇక రాత్రిపూట సోంపు గింజలను నీటిలో వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగవచ్చు. ఇలా ఏ చిట్కా పాటించినా కూడా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు గింజలను భోజనం చేసిన అనంతరం నమిలితే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ ఉత్పత్తి అవదు. జీర్ణవ్యవస్థలో ఉండే అసౌకర్యం కూడా పోతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవడం వల్ల మనకు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీని వల్ల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఒక గ్లాస్ నీటిలో పావు టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి భోజనం చేసే ముందు సేవించాలి. ఇలా తీసుకుంటుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఇలా పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు సైతం మెరుగు పడుతుంది.