న్యూఢిల్లీ : అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏ వయసువారినైనా, ఏ దశలోనైనా బాధిస్తుంటాయి. ముందురోజు రాత్రి ఇష్టమైన ఆహారం అతిగా లాగించినా మరుసటి రోజు అజీర్తి, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వెంటాడుతుంటాయి. ప్రేవుల ఆరోగ్యం మెరుగై జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకర ఆహారంతో పాటు కొన్ని పండ్లు (Super Fruits) కూడా జీర్ణవ్యవస్ధ మెరుగయ్యేందుకు తోడ్పడతాయి. జీర్ణక్రియకు సహకరించే పండ్లలో యాపిల్స్ ముందువరసలో నిలుస్తాయి. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ మలబద్ధకం, డయేరియాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ మెరుగయ్యేందుకు తోడ్పడటంతో పాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు పంపివేయడంలో సహకరిస్తాయి.
ఇక కడుపులో అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను అరటిపండ్లు నివారిస్తాయి. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకూ అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సీతో పాటు ఫైబర్ పుష్కలంగా లభించే ఆఫ్రికాట్ శరీరంలో రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది. ఈ పండులో ఉండే అధిక ఫైబర్‌తో మలబద్ధకం తొలగి జీర్ణక్రియ మెరుగవుతుంది. వీటితో పాటు మామిడి పండ్లు, కివీ కూడా జీర్ణక్రియకు తోడ్పాటు అందిస్తాయి.
Read More :