Fruits For Weight Loss | ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో అధికంగా చేరిన కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, వేళకు భోజనం చేయకపోవడం, అతిగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండడం వంటివి అధికంగా బరువు పెరిగేలా చేస్తాయి. బరువు అధికంగా ఉన్నవారు కచ్చితంగా తగిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళకు భోజనం చేయాలి. తగినన్ని గంటలపాటు నిద్రించాలి. జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. అలాగే ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తింటుండాలి. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
అధిక బరువు తగ్గేందుకు గాను బెర్రీ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను రోజూ తింటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతో సహాయం చేస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సైతం బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. రోజూ ఒక యాపిల్ పండును తింటుంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అని అంటుంటారు. ఆ ప్రకారమే రోజూ ఒక యాపిల్ పండును తింటుంటే శరీరంలోని కొవ్వును కరిగించుకుని అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గేలా చేయడంలో యాపిల్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ బరువును నియంత్రణలో ఉంచుతుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారికి గ్రేప్ ఫ్రూట్ కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల మెటబాలిజం సైతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లలో అధికంగా ఉండే విటమిన్లు సి, ఎ బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. పుచ్చకాయలు మనకు కేవలం వేసవిలోనే కాదు, ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల పుచ్చకాయలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తినేలా చేస్తాయి. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.
పియర్స్ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మేలు జరుగుతుంది. ఈ పండ్లు కూడా బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గేలా చేస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. రోజూ ఒక కివి పండును తింటున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. కివి పండ్లను తింటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఉండదు. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజూ ఒక అవకాడోను తింటున్నా కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తాయి. ఇలా ఆయా రకాల పండ్లను తరచూ తింటుంటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.