న్యూఢిల్లీ : వయసు పైబడే కొద్దీ జ్ఞాపకశక్తి మందగిస్తుంటుంది. అయితే కొందరు విద్యార్ధుల్లోనూ జ్ఞాపకశక్తి, ఏకగ్రాత లోపిస్తుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంతో (Super Foods) మెమరీని మెరుగుపరుచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతుండగా పలు అధ్యయనాలూ ఈ విషయం వెల్లడించాయి. ముఖ్యంగా నాలుగు ఆహార పదార్ధాలతో మెదడు సామర్ధ్యం మెరుగుపరుచుకుని జ్ఞాపకశక్తికి పదునుపెట్టుకోవచ్చు. బ్రైన్ పవర్ పెంచుకునేందుకు ఉపకరించే నాలుగు సూపర్ ఫుడ్స్ ఏంటోచూద్దాం
ఆకుకూరలు : కాలే , బ్రకోలి వంటి ఆకుకూరలు వయసు పెరిగేకొద్ది తగ్గే జ్ఞాపకశక్తిని కాపాడతాయి. మెమరీతో పాటు ఈ తరహా ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉండటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
ఫ్యాటీ ఫిష్ : ట్యూనా, సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్ తరచూ తీసుకోవడం ద్వారా అల్జీమర్ బారినపడే ముప్పు తగ్గడంతో పాటు మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
బెర్రీస్ : బెర్రీస్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన ఔషధాలు జ్ఞాపకశక్తిని కాపాడుతూ, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. మెదడు ఆరోగ్యానికి బెర్రీస్ సూపర్ ఫుడ్‌గా పేరొందాయి. బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
కేఫిన్ : కేఫిన్ స్వల్పకాలిక మెమరీ బూస్ట్‌ను అందించడంతో పాటు దీర్ఘకాలం జ్ఞాపకాలను పదిలం చేయడం, మెమరీని పటిష్టం చేయడంలో శక్తివంతమైనదని నూతన అధ్యయనం వెల్లడించింది.
Read More :