Heart Attack | గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. 26 ఏండ్ల యువకుడు మృతి.. వీడియో వైరల్
Heart Attack | గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో విషాదం నెలకొంది. వినాయకుడి మండపం ముందు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
Heart Attack | గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో విషాదం నెలకొంది. వినాయకుడి మండపం ముందు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వినాయక చవితి సందర్భంగా ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్‌లో కొందరు యువకులు గణపతి విగ్రహం ప్రతిష్టించారు. నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి పూజల అనంతరం యువకులు డీజే పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే స్నేహితుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్న ప్రసాద్ అనే 26 ఏండ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏమైందో తెలియక స్థానికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రసాద్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. దీంతో మారుతీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
#AndhraPradesh pradesh Sri Sathya Sai District: Another #Tragedy in Dharmavaram town.
Prasad (26), a young man, #DiedSuddenly after #collapsing while #Dancing in front of Vinayaka Mandapam(Pandal) in Maruti Nagar, Ward 33 on Wednesday night.#collapse #DiedWhileDancing pic.twitter.com/0lzRm2VPiz— Sunil Veer (@sunilveer08) September 21, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

