China | బీజింగ్: కొన్ని రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన ఆమె.. తన పొట్టలో వృషణాలున్నాయని తేలడంతో కంగుతింది. చివరికి ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించుకొంది. చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో ఈ వింత చోటు చేసుకొంది. సదరు యువతి పుట్టుకతో వచ్చే అడ్రినల్ గ్రంథి వ్యాధితో బాధ పడుతున్నదని వైద్యులు తెలిపారు. ఆమెకు 18 ఏండ్లప్పుడు అసాధారణ హార్మోన్లు ఉన్నాయని తేలింది.
ఆమె యవ్వనంలో అడుగు పెట్టినప్పటి నుంచి స్తనాల పెరుగుదల సరిగా లేకపోవడంతో క్రోమోజోముల పరీక్ష చేయించాలని వైద్యులు సూచన చేశారు. అయితే యువతి తల్లిదండ్రులు దాన్ని పెడచెవిన పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెండ్లికి ముందు వైద్య పరీక్షలు చేయించడంతో తమ కూతురు పురుషుడన్న విషయం వారికి తెలిసి వచ్చింది.