Foot Massage At Night | మనం అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయిస్తుంటాం. ఇంట్లో కూడా సొంతంగా శరీర భాగాలకు మర్దనా చేసుకుంటాం. అయితే వాస్తవానికి శరీరం మొత్తానికి లేదా శరీరంలో కొన్ని భాగాలకు మర్దనా చేయడం వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం మసాజ్ అనేది శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకనే చాలా మంది మసాజ్ చేయించుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే రాత్రి నిద్రకు ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. పాదాలకు మసాజ్ చేయడాన్ని ఆయుర్వేదంలో పాద అభ్యంగ అంటారు. రాత్రిపూట ఇలా పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
రాత్రి పూట పాదాలకు ఏదైనా ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యం అవుతాయి. ఆయుర్వేద ప్రకారం ఈ మూడు దోషాల్లో వచ్చే మార్పుల వల్లే మనకు అనేక రోగాలు వస్తాయి. కనుక రాత్రిపూట పాదాలకు మసాజ్ చేస్తే శరీరంలోకి శక్తి ప్రవహిస్తుంది. దీంతో ఆ మూడు దోషాలు సమతుల్యం అవుతాయి. మనకు ఉండే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పాదాలకు మర్దనా చేసేందుకు మీరు మీ ఇష్టం వచ్చిన ఆయిల్‌ను ఉపయోగించుకోవచ్చు. నువ్వుల నూనె, కొబ్బరినూనె, ఆవ నూనె, బాదంనూనె లేదా ఇతర హెర్బల్ ఆయిల్స్‌ను వాడవచ్చు.
రాత్రిపూట పాదాలకు మర్దనా చేయడం వల్ల శరీరంలో కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయి. దీంతో శరీరంలోకి శక్తి ప్రవేశిస్తుంది. ఫలితంగా మరుసటి రోజు యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం అనేది ఉండదు. ఎంత పనిచేసినా నీరసం, అలసట అనేవి రావు. శరీరం శక్తిని సక్రమంగా ఉపయోగించుకుంటుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. రాత్రిపూట పాదాలకు మసాజ్ చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. చక్కగా నిద్రపడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ముఖ్యంగా పాదాలకు మర్దనా కోసం మీరు లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు. దీంతో శరీరానికి ఎంతో హాయి లభిస్తుంది.
రాత్రిపూట పాదాలకు మర్దనా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అయి ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. ఆందోళన కూడా తగ్గుతుంది. రోజూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు రాత్రి పూట పాదాలకు మర్దనా చేయడం వల్ల ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. మానసిక శక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పాదాలకు రోజూ రాత్రి మసాజ్ చేస్తుంటే లింఫ్ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలు సహజసిద్ధంగా బయటకు పోతాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. శరరీంలోని టాక్సిన్లు, వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
పాదాలకు మసాజ్ చేయడం వల్ల పాదాలు మృదువుగా మారుతాయి. తేమగా ఉంటాయి. చలికాలంలో అయితే చర్మం పగలకుండా ఉంటుంది. ముఖ్యంగా పాదాల పగుళ్ల నుంచి విముక్తి పొందవచ్చు. పాదాలకు మసాజ్ చేయడం వల్ల పాదాలు, కాళ్లు రిలాక్స్ అవుతాయి. దీంతో ఆయా భాగాల్లో ఉండే నొప్పులు తగ్గి ఎంతో హాయి లభిస్తుంది. పాదాలకు రోజూ మసాజ్ చేస్తుండడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు రావు. పాదాలు సురక్షితంగా ఉంటాయి. పాదాలకు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె రాసి మర్దనా చేయడం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా రాత్రిపూట పాదాలకు ఏదైనా నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.