Foods To Eat After 40 Years Of Age | సాధారణంగా యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే వయస్సు మీద పడుతున్న కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయి. అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్నతనంలో సహజంగానే చాలా మంది చిరుతిళ్లను ఎక్కువగా తింటారు. కాస్త వయస్సు పెరిగిన తరువాత ఆ తిండి తగ్గుతుంది. కానీ వయస్సు మీద పడుతున్న తరువాత కూడి చిరు తిండిని తినడం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారు తమ ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా తినే ఆహారం విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం పట్ల అశ్రద్ధ చేస్తే డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక 40 ఏళ్లకు పైబడిన తరువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది.
40 ఏళ్లకు పైబడిన వారు రోజూ తినాల్సిన ఆహారాల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కెరోటినాయిడ్స్ జాబితాకు చెందుతుంది. దీని వల్లే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. టమాటాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుంది. టమాటాలను రోజూ సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వయస్సు మీద పడుతున్న వారికి సహజంగానే కంటి చూపు మందగిస్తుంది. అలాగే బీపీ పెరుగుతుంది. ఈ సమస్యలు రాకుండా అడ్డుకోవాలంటే చిలగడదుంపలను తరచూ తినాలి. వీటిల్లో పొటాషియం, బీటా కెరోటిన్, ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీ పెరగకుండా చూస్తాయి. అలాగే కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లను రక్షిస్తాయి.
40 ఏళ్లకు పైబడిన వారు రోజూ ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తింటుంటే మేలు జరుగుతుంది. గుడ్డులోని పసుపు సొన తీసేసి కేవలం తెల్ల సొనను మాత్రమే తింటుండాలి. దీని వల్ల ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. వీటి వల్ల ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శరీర నిర్మాణానికి ప్రోటీన్లు దోహదం చేస్తాయి. ఎముకలకు బలాన్ని అందిస్తాయి. వీటి వల్ల కండరాల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. 40 ఏళ్లకు పైబడిన వారు వారంలో రెండు సార్లు పుట్ట గొడుగులను తింటుంటే మేలు జరుగుతుంది. వీటి వల్ల క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది.
40 ఏళ్లకు పైబడిన వారు రోజూ ఒక యాపిల్‌ను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉంటాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటివి తగ్గుతాయి. యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. 40 ఏళ్లకు పైబడిన వారు నిత్యం గుప్పెడు బాదంపప్పును నీటిలో నానబెట్టి తింటుండాలి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. కీళ్ల నొప్పులు, వాపులు రాకుండా చూసుకోవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా 40 ఏళ్లకు పైబడిన స్త్రీలు, పురుషులు ఆయా ఆహారాలను రోజూ తింటుంటే వృద్ధాప్యంలో ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.