Superfoods : కలిసి ఉంటే కలదు సుఖం అని మనం తరచూ వింటూ ఉంటాం. అయితే జీవితంలో పలు విషయాలకు దీన్ని అన్వయించుకోవచ్చు. ఇక ఫుడ్ విషయంలోనూ నిర్ధిష్ట ఆహార పదార్ధాలను కలపడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్ధాల కలయికతో అవి సూపర్ ఫుడ్స్‌గా మారతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వాటిని వండే తీరు, వాటిలో కలిపే పదార్ధాలు అదనంగా జోడించే పదార్ధాలు వాటి రుచిని పెంచడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఇలా ప్రయత్నించడం ద్వారా సాధారణ ఆహార పదార్ధాలను సూపర్ ఫుడ్స్‌గా ట్రాన్స్‌ఫాం చేయవచ్చు. మనం తీసుకునే ఆహారపదార్ధాల నుంచి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను ఆశించకుండా ఉండలేం.
బ్రేక్‌ఫాస్ట్‌గా పలువురు తీసుకునే పోహ తేలికపాటి ఆహారంగా అందరూ ఇష్టపడుతుంటారు. పోహలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ పోహలో కొద్దిగా నిమ్మరసం జోడించి తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ సీ శరీరం ఐరన్‌ను మెరుగ్గా సంగ్రహించేలా చేసి సూపర్ ఫుడ్ కాంబినేషన్‌గా మారుతుంది. ఇక ఎలాంటి ఆహార పదార్ధాలను మిక్స్ చేయడం ద్వారా అవి సూపర్ ఫుడ్స్‌గా మనకు మేలు చేస్తాయనే వివరాలను న్యూట్రిషనిస్ట్ శ్వేత జే పంచల్ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో వివరించారు.
పోహ, లెమన్
యోగర్ట్ నట్స్
గ్రీన్ టీ లెమన్
పసుపు మిరియాలు
దాల్ చావల్
Read More :