Foods For Mens Health | ఆరోగ్యంగా ఉండడం కోసం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తినాలని మనకు వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆరోగ్యం కోసం సరైన డైట్‌ను పాటిస్తుంటారు. అయితే పురుషులు తమ ఆరోగ్యం కోసం పనికొచ్చే ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పురుషులకు వయస్సు రీత్యా, ఇతర కారణాల వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు అందరూ రెగ్యులర్ గా పాటించే డైట్‌ను కాకుండా కాస్త భిన్నమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పురుషులు తమకు అధికంగా వచ్చే సమస్యలను బట్టి డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. పురుషుల శరీరం స్త్రీల కన్నా భిన్నమైన నిర్మాణం, అవసరాలను కలిగి ఉంటుంది. కనుక వారు కాస్త భిన్నమైన ఆహారాలను తీసుకోవాలి. అవి వారి ఆరోగ్యానికి దోహదం చేసేవి అయి ఉండాలి. అలా ఉంటేనే పురుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ఇక పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితమైన డైట్‌ను పాటించాల్సి ఉంటుంది.
పురుషులకు సాధారణంగా స్త్రీలకన్నా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు గాను ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పురుషులు తృణ ధాన్యాలను అధికంగా తినాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు వస్తాయి కనుక వారు ఆ గ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. తృణ ధాన్యాలను తినడం వల్ల ప్రోస్టేట్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే కండరాల ఆరోగ్యం మెరుగు పడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. అలాగే పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా వంటివి తృణ ధాన్యాల జాబితాకు చెందుతాయి. వీటిని పురుషులు రోజూ తింటుంటే ఆరోగ్యంగా ఉంటారు.
పాలకూర కూడా పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషియం రక్త నాళాలను వెడల్పు చేస్తుంది. రక్త నాళాల వాపులను తగ్గిస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు. పాలకూరలో ఉండే ఫోలేట్ వల్ల పురుషుల్లో హోమోసిస్టీన్ లెవల్స్ తగ్గుతాయి. హోమోసిస్టీన్ వల్ల రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక హోమోసిస్టీన్ తగ్గాలంటే పాలకూరను తినాల్సి ఉంటుంది. దీని వల్ల పురుషులు తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి నట్స్, సీడ్స్‌ను పురుషులు రోజూ తినేలా ప్లాన్ చేసుకోవాలి. వీటిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక నట్స్, సీడ్స్‌ను తినడం వల్ల పురుషులకు అధిక మొత్తంలో విటమిన్ ఇ లభిస్తుంది. ఇది పురుషుల్లో ఉండే నపుంసకత్వ సమస్యను తగ్గిస్తుంది. శృంగార సామర్థ్యం పెరిగేలా చేస్తుంది. అలాగే వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది. శుక్ర కణాల కదలిక సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీని వల్ల సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. పురుషులు చేపలను కూడా తరచూ తింటుండాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ప్రోస్టేట్ గ్రంథిని రక్షిస్తాయి. దీంతో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే కోడిగుడ్లు, పుట్టగొడుగులు, మటన్ లివర్, రొయ్యలు వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాలను కూడా పురుషులు రోజూ తీసుకోవాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తిపెరగడమే కాదు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇలా పురుషులు ఆయా ఆహారాలను తరచూ తీసుకుంటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.