Foods For Libido | ప్రస్తుతం చాలా మంది పురుషుల్లో శృంగార సామర్థ్యం ఉండడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఎదుర్కొనే పని ఒత్తిడితోపాటు తీసుకునే ఆహారం, ధూమపానం, మద్యపానం వంటివి కూడా పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గడానికి కారణం అవుతున్నాయి. అయితే ఈ సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. డాక్టర్ వద్దకు వెళ్లాలంటే సిగ్గుగా అనిపిస్తుంది. కానీ ఈ సమస్య ఉంటే చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సమస్య తగ్గాలంటే మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో మనకు సహజసిద్ధంగా లభించే ఆహారాలను తింటున్నా చాలు.. పురుషులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ అయి జననావయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఏదైనా ఒక రకానికి చెందిన నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తింటుండాలి. వీటిని నానబెట్టి తినాలి. రాత్రి పూట ఈ గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తోపాటు తినవచ్చు. ఈ గింజలను తినడం వల్ల పురుషుల్లో లైంగిక పటుత్వం పెరుగుతుంది. అలాగే శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం అనేది ఉండదు. ఎంత పని చేసినా అలసిపోరు. అలాగే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ గింజల్లో సెలీనియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచడంతోపాటు మెదడులో డోపమైన్ స్థాయిలను అధికం చేస్తాయి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగారం అంటే ఆసక్తి కూడా కలుగుతుంది.
రోజూ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తింటున్నా కూడా పురుషులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. రోజంతా పని చేసి అలసిన వారికి కోడిగుడ్డు మంచి శక్తిని అందిస్తుంది. కోడిగుడ్లలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి అలసటను దూరం చేసి శక్తిని అందిస్తాయి. దీంతో ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. పురుషుల్లో వచ్చే అంగ స్తంభన సమస్యకు కోడిగుడ్లతో చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్లలో ఉండే ప్రోటీన్లు శరీర శక్తి సామర్థ్యాలను పెంచుతాయి. యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. అలాగే స్ట్రాబెర్రీలు కూడా శృంగారం పట్ల ఆసక్తిని, ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. స్ట్రాబెర్రీలను తింటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. శృంగారం పట్ల ఆసక్తి పెరిగేలా చేసే హార్మోన్ ఇది. అందువల్ల స్ట్రాబెర్రీలను తింటే ఆ కార్యంలో రెచ్చిపోవచ్చు.
కాఫీ కూడా పురుషుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. శరీర జననావయవాలకు రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీంతో కొవ్వు కరగడమే కాదు పురుషులకు కావల్సిన శక్తి లభిస్తుంది. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే ఆల్చిప్పలను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. సముద్రపు ఆహారంలో ఇవి ఎంతగానో పేరు గాంచాయి. ఆల్చిప్పలను తింటే జింక్, విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తాయి. ఇవి టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతాయి. శృంగారం పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాయి. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరిగేలా చేస్తాయి. అలాగే రోజూ పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో తింటున్నా కూడా పురుషులు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవచ్చు. ఇలా పలు ఆహారాలను తింటుంటే పురుషుల్లో శృంగారం పట్ల కాంక్ష పెరుగుతుంది. ఆ సామర్థ్యం కూడా రెట్టింపవుతుంది.