Foods For Eye Sight | ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు మన కళ్లకు పని ఉంటుంది. పుస్తకాలు చదివినా, టీవీ చూసినా, ఫోన్ వీక్షించినా, ఆఫీస్‌లో కంప్యూటర్ ఎదుట పనిచేసినా.. కళ్లు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అలాంటి అతి ముఖ్యమైన నేత్రాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ వీటిని తింటే కంటి చూపు కూడా మెరుగు పడి కొద్ది రోజులకు కళ్లద్దాలను తీసి పడేస్తారు. ఇక ఆ ఆహారాలు ఏమిటంటే..
వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ ఇ వయస్సు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పల్లీలు ఇలా పలు రకాల నట్స్ లేదా సీడ్స్‌ను తీసుకుంటే మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి మన కళ్లను రక్షిస్తాయి.
విత్తనాల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. సబ్జా, అవిసె గింజలు, చియా సీడ్స్‌ను తీసుకోవచ్చు. వీటి ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.
నిమ్మజాతికి చెందిన పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ సి కూడా వయస్సు పైబడడం వల్ల వచ్చే కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మ, ద్రాక్ష పండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.
వీటిల్లో ఉండే లుటీన్, గ్జియాంతిన్ వయస్సు పైబడడం వల్ల వచ్చే కంటి ఇబ్బందుల నుంచి కాపాడుతాయి. కంటి ఆరోగ్యానికి ఉపకరించే విటమిన్ ఎ ఉంటుంది. అంతేకాదు. విటమిన్లు సి, కె, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
వీటిల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. బీటా కెరోటిన్ సహాయంతో శరీరం విటమిన్ ఎ ను తయారు చేసుకుంటుంది. క్యారెట్లను ఎక్కువగా తీసుకోడం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు.
క్యారెట్లలో మాదిరిగా వీటిల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.న విటమిన్ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండేవీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
వీటిల్లో ఉండే లుటీన్, గ్జియాంతిన్ వయస్సు పైబడడం వల్ల తలెత్తే కంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. కోడిగుడ్లలో విటమిన్లు సి, ఇ, జింక్ కూడా ఉంటాయి.
చాలా రకాల చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ట్యూనా, సాల్మన్ శరీర కణజాలంలో నూనె ఎక్కువగా ఉంటుంది. వీటిన విరివిగా తీసుకోడం వల్ల కళ్లు తేమను కోల్పోకుండా ఉంటాయి. ఈ ఆహారాన్ని తీసుకుంటూ తగినన్ని నీళ్లను తాగడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.