Obesity | ఊబకాయం విషయంలో.. మనం ఆహారాన్ని తినే సమయం, ఆ ఆహారంలోని క్యాలరీలదే ముఖ్యపాత్ర అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని నిరూపించేందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకల మీద నాలుగేండ్ల పాటు సుదీర్ఘమైన పరిశోధన చేశారు. ఇందుకు వాటిని మూడు విభాగాలుగా వేరు చేశారు.
మొదటి విభాగంలోని ఎలుకలు ఎప్పుడుపడితే అప్పుడు, ఎంతపడితే అంత ఆహారం తినే అవకాశం ఇచ్చారు. రెండో విభాగంలోని ఎలుకలకు చురుగ్గా పనిచేస్తున్న సమయంలో ఎక్కువ ఆహారం అందించారు. ఇక మిగిలిన వాటికి తగిన సమయంలో ఆహారం ఇవ్వడంతోపాటు, అందులో క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకున్నారు.
ఈ మూడో అలవాటుతో ఎలుకల జీవనప్రమాణం 35 శాతం పెరిగినట్టు తేలింది. దీన్నిబట్టి మనం ఎంత తింటున్నాం అనేదాని కంటే.. అందులో క్యాలరీలు ఎంతన్నదే ముఖ్యం. శరీరంలో జీవక్రియలు వేగంగా ఉండే సమయంలోనూ, శారీరక శ్రమకు ముందూ.. ఎక్కువ ఆహారం తీసుకోవడం ఉత్తమం.