Brain Health | మన శరరీంలోని అవయవాల్లో మెదడు అత్యంత ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. మన శరీరానికి అందే ఆక్సిజన్ లేదా శక్తిలో దాదాపుగా 20 శాతం వరకు మెదడు ఉపయోగించుకుంటుంది. మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అందుకనే మనం యాక్టివ్‌గా పనిచేయగలుగుతాం. చురుగ్గా ఉండగలుగుతాం. మనం నిద్రించినా కూడా మన మైండ్ ఎల్లప్పుడూ అలర్ట్‌గానే ఉంటుంది. అయితే వయస్సు మీద పడే కొద్దీ మతిమరుపుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గుదల, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా మందికి ఉంటున్నాయి. ఇవి కూడా మెదడు సమస్యలకు కారణం అవుతున్నాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే పలు చిట్కాలను పాటిస్తే దాంతో మెదడును ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. దీని వల్ల మైండ్ ఎల్లప్పుడూ షార్ప్‌గా ఉంటుంది. మెదడుకు నిరంతరం పని కల్పించాలి. ఏదో ఒక కొత్త అలవాటును నేర్చుకోవాలి. లేదా ఒక కొత్త భాష, కొత్త కోర్సు ఇలా ఏదో ఒకటి నేర్చుకోవాలి. దీంతో మెదడుకు ఎల్లప్పుడూ పని ఉంటుంది. మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది. దీంతో మతిమరుపు రాదు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. అదేవిధంగా రోజూ తగినంత నిద్ర కూడా అవసరమే. రోజూ కనీసం 7 నుంచి 9 గంటలపాటు నిద్రించాలి. నిద్రించడం వల్ల మెదడు రీచార్జి అవుతుంది. కణాలకు పునరుత్తేజం లభిస్తుంది. మెదడు కణాలు యాక్టివ్‌గా మారుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కనుక రోజూ తగినన్ని గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కచ్చితంగా తగినన్ని గంటలపాటు నిద్రించాలి.
మనం తీసుకునే ఆహారం కూడా మన మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మనం కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలు, మాంసం అతిగా తిన్నా, మద్యం అతిగా సేవించినా, పొగ తాగినా మెదడు మొద్దు బారిపోతుంది. మెదడు చురుగ్గా ఉండదు. దీంతోపాటు బద్దకం కూడా వస్తుంది. మెదడు యాక్టివ్‌గా ఉండేందుకు ఆహారం కూడా ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలను తింటుండాలి. అలాగే తృణ ధాన్యాలు, చేపలు, వాల్ నట్స్, ఓట్స్, బాదంపప్పు, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి ఆహారాలను తింటుండాలి. ఇవి మెదడుకు కావల్సిన పోషకాలను అందజేస్తాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కనీసం 30 నిమిషాల పాటు రోజూ వాకింగ్ చేస్తే మూడ్ మారుతుంది. శరీరంలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. కనుక రోజూ వ్యాయామం తప్పనిసరి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే పజిల్స్‌ను నింపడం, పుస్తకాలను చదవడం, చెస్ ఆడడం, కొత్త అంశాలను నేర్చుకోవడం వంటి పనులు చేయాలి. దీని వల్ల మెదడుకు తగినంత శ్రమ లభిస్తుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. ఇలా పలు చిట్కాలను పాటిస్తే మెదడును ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వృద్ధాప్యంలోనూ మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారు.