Weight Loss Tips | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బరువు అధికంగా ఉండడం వల్ల అనేక వ్యాధులు సైతం వస్తున్నాయి. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బరువును తగ్గించుకునేందుకు వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవడం, డైట్‌ను పాటించడం వంటివి చేస్తున్నారు. అయితే వీటితోపాటు కొన్ని సూచనలను పాటించడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. వీటిని పాటించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పనిలేదు. రోజూ మీరు చేసే పనుల్లోనే వీటిని అనుసరించవచ్చు. ఈ సూచనలను పాటిస్తే శరీరంలో కొవ్వు వేగంగా కరిగిపోతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఇక ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫీసుల్లో పనిచేసేవారు సాధారణంగా ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ను ఎక్కువగా వాడుతారు. పని త్వరగా చేయాలని చెప్పి సహజంగానే లిఫ్ట్‌ను ఉపయోగిస్తారు. అయితే పని వేగంగా చేయాల్సిన అవసరం లేదని అనుకుంటే మెట్లను వాడాలి. వీలైనంత వరకు మెట్లను ఉపయోగించాలి. అవసరం అనుకుంటేనే లిఫ్ట్‌ను వాడాలి. ఇలా మెట్లను ఎక్కువగా వాడడం వల్ల శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. అలాగే ఆఫీసుల్లో పనిచేసేవారు ఎక్కువగా ఇంటర్‌కామ్ ను ఉపయోగిస్తారు. చిన్న పని కోసం కూడా వారు దాన్ని వాడుతారు. అయితే అంతగా అవసరం లేకపోతే సహ ఉద్యోగుల వద్దకు నడిచి వెళ్లి పని చక్కబెట్టుకోండి. దీని వల్ల కూడా ఎంతో కొంత శారీరక శ్రమ అయి బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
సాధారణంగా చాలా మంది తమ ఇంటి దగ్గరలో ఉన్న షాపులకు కూడా వాహనాలపై వెళ్తుంటారు. అర్జెంట్ అయితే తప్ప అలా చేయకండి. నడుచుకుంటూ షాప్‌కు వెళ్లండి. లేదా సైకిల్‌ను ఉపయోగించండి. దీని వల్ల శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. బరువు తగ్గాలనుకునే లక్ష్యం నెరవేరుతుంది. అలాగే వారంలో కనీసం ఒక రోజు ఇంట్లో పని చేస్తుండాలి. ఇంటిని శుభ్రం చేయడం, తోట పనిచేయడం, దుమ్ము, ధూళి దులపడం వంటి పనులు చేయాలి. దీని వల్ల కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. దీన్ని అలవాటుగా చేసుకుంటే శరీరానికి ఎంతో వ్యాయామం అవుతుంది. దీని వల్ల బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. అలాగే చాలా మంది ఫోన్‌ను గంటల తరబడి మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఫోన్ కాల్ వచ్చినప్పుడు సరదాగా బయట అలా నడుస్తూ ఫోన్లో మాట్లాడండి. దీంతో శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. బరువు త్వరగా తగ్గుతారు.
మీ ఇంటికి దగ్గరలో ఏదైనా పార్కు లేదా ఖాళీ స్థలం ఉంటే రోజూ అలా బయటకు వచ్చి కాసేపు ప్రకృతిలో గడపండి. ఇలా చేయడం వల్ల కూడా వ్యాయామం చేసినట్లు అవుతుంది. బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఆఫీసులకు చాలా వరకు ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. కనుక మీ సొంత వాహనం కన్నా ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించండి. దీని వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు, మీకు పెట్రోల్ చార్జిల భారం తప్పుతుంది. అలాగే శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఏదో ఒక పనిచేస్తూనే ఉండండి. యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. బద్దకం వీడండి. వీలున్న ప్రతి చోట నడిచేందుకు ప్రయత్నించండి. దీని వల్ల కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. ఇలా ఆయా సూచనలను పాటించడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరిగిపోతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.